మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై పడి ఉన్న శవం తమకు చెందిన వ్యక్తిదే అని గుర్తించిన బంధువులు ఎంతో బాధపడ్డారు. చివరికి చనిపోయింది తమ వ్యక్తి కాదని ఎంతో సంతోషించారు.
ఇదో విచిత్ర ఘటన. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. తీవ్ర బాధలో మునిగిపోయారు. అధికారులు పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. అయితే కొంత సమయం తరువాత చనిపోయాడుకున్న వ్యక్తి తమకు చెందిన వాడు కాదని తెలియడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బిపోయారు. మృతుడిని గుర్తించడంలో బంధువులు చేసిన పొరపాటు ఈ ఘటనకు దారి తీసింది. ఇది మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
కేరళలో వింత.. శవంతో నవ్వుతూ, తుళ్ళుతూ ఫ్యామిలీ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్..
మధ్యప్రదేశ్ జిల్లా బ్యూహరి ప్రాంతంలో ఓ రైల్వే ఉద్యోగి చనిపోయాడని భావించి పోలీసులు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం మృతుడి మొబైల్‌ని తీసుకోవడానికి బంధువులు గదికి వెళ్లి చూడగా అతడు నిద్రిస్తూ కనిపించడంతో షాక్ అయ్యారు. ఎంతో సంతోషించారు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, బ్యూహరి పోలీసు, రైల్వే అధికారులు కూడా గందరగోళానికి గురయ్యారు.
వివరాలు ఇలా ఉన్నాయి. కట్నీ-చౌపాన్ లైన్‌లోని బ్యూహరి నుండి కట్ని మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆగస్టు 20వ తేదీన ఒక మృతదేహం లభించింది. ఈ సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహం ట్రాక్‌మెన్ జ్ఞానేంద్ర పాండే గా స్థానిక రైల్వే అధికారులు ఉద్యోగులు గుర్తించారు. అతడు బ్యూహరిలోనే ట్రాక్‌మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జ్ఞానేంద్ర బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. అప్పటికే చాలా రాత్రి అయ్యింది.
రెండో రోజు జ్ఞానేంద్ర అన్నయ్య దేవేంద్ర పాండే తన బంధువులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం ఛిద్రమై ఉండడంతో పాటు అతడు వేసుకున్న బట్టలు కూడా దాదాపు ఒకే విధంగా ఉండటంతో చనిపోయిన వ్యక్తి తన సోదరుడే అనే నిర్ధారించారు. రైల్వే ఉద్యోగులు కూడా అది నిజమే అని ధృవీకరించుకోవడంతో తదుపరి దర్యాప్తు ఏం చేయలేదు. ఈ విషయంతో తెలియడంతో బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాన్ని బ్యూహరి పోలీస్ స్టేషన్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఒకే కుటుంబంలో 11మందిని కాటేసిన పాము.. ఐదుగురు మృతి..!
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే ముందు మృతుడి సోదరుడికి ఒక అనుమానం వచ్చింది. ఘటనా స్థలంలో తన తమ్ముడి మొబైల్ ఫోన్ కనిపించలేదని, గదికి వెళ్లి చూద్దామని బంధువులకు సూచించాడు. అనంతరం బంధువులు అంతా స్థానికంగా ఉండే జ్ఞానేంద్ర గదికి వెళ్లి చూడగా ఆశ్చర్యానికి గురయ్యారు. చనిపోయాడు అని అనుకున్న వ్యక్తి లోపల నిద్రపోతూ కనిపించాడు. వెంటన అతడిని లేపి జరిగిన సంఘటన అంతా చెప్పగానే షాక్ అయ్యాడు.
ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసు కమల్ సింగ్ ఆ మృతదేహాన్ని బంధువుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఐడెంటిఫైయర్లు మృతుడిని సరిగ్గా గుర్తించలేకపోయారని, దీని కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అయితే లభ్యమైన మృతదేహం ఎవరిదనేది ఇంకా గుర్తించబడలేదు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయంలో జ్ఞానేంద్ర పాండే మాట్లాడుతూ.. తన సహచరులు మృతదేహాన్ని గుర్తించడంలో పొరపాటు చేశారని, పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈ పరిణామం తనకు, తన కుటుంబానికి తీవ్ర బాధను కలిగించిందని చెప్పారు.
