ఉత్తర భారతంలో కొనసాగుతున్న కోల్డ్ వేవ్.. రాజస్థాన్ చురులో సున్నా డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. పొగ మంచు దుప్పటిలా కప్పేస్తోంది. ఢిల్లీ, చుట్టు పక్కల రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజస్థాన్ లోని చురులో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఉత్తర భారతదేశంలో కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. ఢిల్లీలో పాటు దాని చుట్టపక్కల రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరో రాబోయే రెండు రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చల్లగాలులు వీచే అవకాశం ఉంటుందని భారత వాతవరణ కేంద్రం తన తాజా బులిటెన్ లో పేర్కొంది. జనవరి 10-13 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్వర్ణం
వచ్చే 24 గంటల్లో మధ్యప్రదేశ్, బీహార్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని ఉత్తర ప్రాంతాలకు దట్టమైన పొగమంచు వ్యాపించే సూచన ఉందని పేర్కొంది. కాగా.. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హర్యానా, పంజాబ్‌లలో కూడా చలిగాలుల పరిస్థితులు కొనసాగాయి.
హర్యానాలోని నార్నాల్, హిసార్‌లో 2 డిగ్రీల సెల్సియస్, సిర్సాలో 3.2 డిగ్రీల సెల్సీయస్, భివానీలో 5.2 డిగ్రీల సెల్సీయస్, రోహ్‌తక్‌లో 4.4 డిగ్రీల సెల్సీయస్, కర్నాల్‌లో 4.5 డిగ్రీల సెల్సీయస్, అంబాలాలో 5.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్‌లోని భటిండా, గురుదాస్‌పూర్‌లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లూథియానాలో 6.3 డిగ్రీలు, పాటియాలాలో 4.6 డిగ్రీలు, అమృత్‌సర్‌లో 6.6 డిగ్రీలు, మొహాలీలో 6.1 డిగ్రీలు ఉష్ణోగ్రత వెలుగు చూసింది. చండీగఢ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 5.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది.
కాగా.. రాజస్థాన్ లో తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాలు వరుసగా కొన్ని రోజులుగా గడ్డకట్టే స్థాయి కంటే దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చురులో 0.0 డిగ్రీల సెల్సియస్, జనవరి 6 రాత్రి పిలానీలో 0.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండీ తెలిపింది.