Hyderabad: జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ స్వర్ణం సాధించాడు. నిజామాబాద్ పట్టణానికి చెందిన హుసాముద్దీన్ 4-1తో విజయం సాధించాడు.

National Boxing Championship: జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ స్వర్ణం సాధించాడు. నిజామాబాద్ పట్టణానికి చెందిన హుసాముద్దీన్ 4-1తో విజయం సాధించాడు. వివ‌రాల్లోకెళ్తే.. హిస్సార్‌లో శుక్రవారం జరిగిన 6వ ఎలైట్ పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహ్మద్ హుసాముద్దీన్ బంగారు పతకం సాధించాడు. తెలంగాణలోని నిజామాబాద్ పట్టణానికి చెందిన హుసాముద్దీన్ 4-1 స్కోర్‌లైన్‌తో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ (SSCB) పది పతకాలతో ముందుంది.

అస్సాం ఆసియా పతక విజేత శివ థాపా 2021 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (RSPB) అంకిత్ నర్వాల్‌ను 63.5 కిలోల ఫైనల్‌లో ఓడించాడు. 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌ల కాంస్య పతక విజేత నరేందర్ (+92) 2022 కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత సాగర్‌తో జరిగిన ఫైనల్ పోరులో వాకోవర్ అందుకున్నాడు. అతను చిన్న గాయం కారణంగా మ్యాచ్‌లో పాల్గొనలేకపోయాడు. పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో SSCB బాక్సర్లు ఆరు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బిశ్వామిత్ర చోంగ్‌థమ్ (51 కేజీలు), సచిన్ (54 కేజీలు), ఆకాశ్ (67 కేజీలు), సుమిత్ (75 కేజీలు)లు జట్టు ఇతర స్వర్ణ పతక విజేతలుగా ఉన్నారు.