సినిమాలంటే పడి చచ్చేవారు చాలా మంది ఉంటారు. ఓ సినిమా చూసి వచ్చాక.. అదే లోకంలో విహరిస్తూ ఉంటారు. కొందరైతే.. అచ్చం ఆ క్యారెక్టర్ లో జీవిస్తూ ఉంటారు. అది తన కథేనని.. తానను తాను హీరోగా భావిస్తూ ఉంటారు. అయితే... ఓ వ్యక్తికి ఈ రకం ఫీలింగ్ అందరికన్నా మరింత ఎక్కువగా ఉంది. దీంతో.. ఎకంగా తన పేరును కూడా మార్చేసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన వికాస్ కందమ్ కి సినిమాలంటే పిచ్చి. అందులోనూ జేమ్స్ బాండ్ సినిమాలంటే మరింత పిచ్చి. ఈ క్రమంలో.. అతనికి ఎప్పటినుంచో తన పేరును జేమ్స్ బాండ్ గా మార్చుకోవాలని భావించేవాడు. సరదాగా చెబుతున్నాడులే అని అందరూ అతని మాటలు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు అతను మాత్రం తాను అనుకున్న పని చేసి నిరూపించాడు.

తన పేరెంట్స్ పెట్టిన పెట్టిన పేరును కూడా కాదనుకుని జేమ్స్ బాండ్‌గా తన పేరును మార్చుకున్నాడు. అదీ అధికారికంగా.. రికార్డుల్లో ఈ మార్పును సుస్థిరం చేశాడు. ముడు నెలల క్రితం..కట్టుకున్న భార్యకు కూడా చెప్పా పెట్టకుండా గప్‌చుప్‌గా పనికానిచ్చేశాడు. స్నేహితులకు ఈ నిర్ణయం గురించి తెలిసినప్పటకీ అతడి మొండి పట్టు చూసి ఏంచేయలేక సైలెంట్ అయిపోయారు.

అయితే ఇటీవల ఓ శుభముహుర్తాన ఇంట్లో భార్య చెవున పేరు మార్పు గురించి వికాస్..సారి జేమ్స్ బాండ్ బయటపెట్టేశాడు. భర్త చేసిన పనికి ఆమె షాకైపోయిందట. అందరిలో భర్త తన పరువు తీసాడంటూ ఆమె లబోదిబోమంటుంది. మీ ఆయన పేరేంటి అని ఎవరైనా అడిగితే.. జేమ్స్ బాండ్ అని చెబితే నమ్ముతారా.. నువ్వేసుకుంటారు అంటూ ఆమె బాధపడుతోంది. భర్త చేసిన పనికి కోపంతో మాట్లాడటం కూడా మానేసిందట. కాగా.. ఇక మన హీరో జేమ్స్ బాండ్.. ఈ విషయాన్ని తన కన్న తల్లిదండ్రులకు కూడా త్వరలోనే చెప్పనున్నాడట.  అంతేకాకుండా త్వరలోనే తన ఆధార్, పాన్ కార్డ్ లపై కూడా పేరు మార్చుకోవడానికి సిద్ధపడుతుండటం గమనార్హం.