The Kashmir Files: 'ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం లో ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి  కాశ్మీర్ లోయ నిజమైన చరిత్రను తెర‌కెక్కించారని నితిన్ గడ్కరీ ప్ర‌శంసించారు. కశ్మీరీ పండిట్లకు గొప్ప చరిత్ర ఉందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు చ‌రిత్ర‌ను  పునఃసమీక్షించార‌ని  అన్నారు. 

The Kashmir Files: 'ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం కాశ్మీరీయుల‌ నిజమైన చరిత్రను బయటకు తెచ్చిందని, ఈ చిత్రం చిరకాలం గుర్తుండిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగ‌ళ‌వారం The Kashmir Files చిత్రంలో న‌టించిన నటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలను ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీ పాల్గొని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత శ్యామ్ జాజు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. కాశ్మీరీ పండిట్ల గొప్ప చరిత్ర ఉందని, కాశ్మీరీ పండిట్లను వేధించడం, బలవంతంగా (లోయ నుండి) తరలించడం వంటి వాస్త‌విక విషయాల‌ను ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు చిత్రీక‌రించార‌ని, చరిత్రను పునఃసమీక్షించార‌ని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు గడ్కరీ. కాశ్మీరీ పండిట్‌ల నిజమైన చరిత్ర ప్రజలకు తెలియదని, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. అగ్నిహోత్రి సినిమాకు దర్శకత్వం వహించిన విధానం, వాస్తవాలను, వాస్తవిక కథను ప్రజలకు తెలియ‌జేశార‌ని మంత్రి తెలిపారు. ఈ సినిమా చిరకాలం గుర్తుండిపోతుందనీ,. కొత్త తరానికి కాశ్మీరీ పండిట్ల చరిత్ర గురించి కూడా ఈ సినిమా తెలిసేలా చేస్తుందని , ఇందుకు వివేక్ అగ్నిహోత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి గడ్కరీ.

ఫండమెంటలిజం ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని నాశనం చేస్తుందని అగ్నిహోత్రి సినిమా ద్వారా చూపించారని అన్నారు. ఏ దేశంలోనైనా 51 శాతానికి పైగా ఛాందసవాదులు ఉంటే.. ఆ దేశంలో ప్రజాస్వామ్యం, సోషలిజం, లౌకికవాదం ఉండవ‌ని ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సహనమే మన జాతి ప్రత్యేకత‌నీ, జాతీయవాదమే మన ఆత్మ అనే దృక్కోణంతో సినిమాలో నటీనటులు మెప్పించారని గడ్కరీ అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఇంద్రేష్ కుమార్ రికార్డ్ చేసిన వీడియో సందేశాన్ని నిర్వాహకులు ప్లే చేసారు, 'ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం బాధాకర నిజ జీవితాంశ‌మ‌ని చెప్పాడు. ఈ వాస్తవాన్ని తిరస్కరించే ఎవరైనా మానవత్వానికి, హిందూత్వానికి, రాజ్యాంగానికి శత్రువులని అన్నారు. సినిమాను అబద్ధం అని అభివర్ణించి, హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచుతుందని, మతపరమైన ఓటు బ్యాంకు ప్ర‌భావిత‌మ‌వుతోందని ఆందోళ‌న చెందుతున్నార‌ని తెలిపారు. కాశ్మీర్ లోయలో కాశ్మీరీ హిందువులు, సిక్కులను హతమార్చిన వారిని విమర్శించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కాశ్మీర్‌లో ఇటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా చూసేందుకు మనం కృషి చేయాలి. కాశ్మీర్ కౌంటీలో అంతర్భాగం, ఇది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది" అని శ్రీ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. కశ్మీరీ పండిట్‌ల కథలు, మరుగున పడిన కథలు ఇప్పుడు బయటకు వచ్చాయన్నారు. "నేను హృదయపూర్వకంగా నటించిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి. సినిమాను విమర్శించే వారిపై నేను దృష్టి పెట్టను. కాశ్మీరీల కోసం ఈ ప్రభుత్వం చేసినంత పనిని మరే ప్రభుత్వం చేయలేదని భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది" అని ఖేర్ అన్నారు.


దర్శకుడు అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఎలాంటి ప్రచారం చేయ‌లేదని, ఎవరినీ విమర్శించలేదని అన్నారు. ఎవరినీ విమర్శించడం మా లక్ష్యం కాదు.. మేం పాకిస్థాన్ అనే పదాన్ని ఉపయోగించలేదనీ. ఆ చిత్రంలో అస‌లు ఎక్క‌డ కూడా ముస్లింలను విమర్శించలేద‌నీ. కేవలం ఒక సమూహంలోని వ్యక్తుల దుస్థితిని మాత్రమే ఎత్తి చూపామ‌ని తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి గడ్కరీ కాకుండా.. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీపాద్ నాయక్ మరియు VK సింగ్, RSS జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ ప్ర‌త్యేక ఆహ్వానితులు. కానీ మంత్రి గడ్కరీ తప్ప మరెవరూ కార్యక్రమానికి రాలేదు. ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు. ప్రధానంగా కాశ్మీరీ పండిట్‌లు, వారిలో సంబంధీకులు ఈవెంట్ కు విదేశాల నుండి వచ్చారు. ఆ స‌భ ప్రాంగ‌ణ‌మంతా.. "భారత్ మాతా కీ జై, "జై శ్రీ రామ్" నినాదాలతో మారుమోగింది.