Asianet News TeluguAsianet News Telugu

శివసేనను అంత‌మొందించ‌డమే కాంగ్రెస్, ఎన్సీపీల ఆలోచ‌న‌ - సంజయ్ శిర్సాత్

శివసేన పార్టీని అంతం చేయాలని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయని సేన ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని తాము ఎన్నో సార్లు చెప్పాలని ప్రయత్నించినా వినిపించుకోలేదని తెలిపారు. 
 

The Idea of the Congress and the NCP is to eliminate the Shiv Sena - Sanjay Shirsat
Author
Mumbai, First Published Jun 24, 2022, 11:52 AM IST

శివసేనను నాశనం చేయాలని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) భావిస్తున్నాయని శివ‌సేన రెబల్ ఎమ్మెల్యే సంజయ్ శిర్సాత్ ఆరోపించారు. ఈ విష‌యాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పామ‌ని, అయితే మా స‌ల‌హాను ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. సేన నాయకుల కోసం ఠాక్రే త‌న కార్యాలయాన్ని మూసివేసినట్లు ఆయ‌న తెలిపారు. 

రెబెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద హైడ్రామా: శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్

చాలా మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వైపు మొగ్గు చూపుతున్న స‌మ‌యంలో పలుమార్లు ఉద్ధవ్ ఠాక్రేను క‌లిసేందుకు స‌మ‌యం కోరార‌ని, కానీ వారిని సీఎం ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని ఆరోపించారు. ఓ త‌హ‌సీల్దార్ లేదా రెవెన్యూ అధికారిని నియ‌మించే ముందు స్థానిక ఎమ్మెల్యేను సంప్ర‌దించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఈ సమస్యలపై తాము ఉద్ధవ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశామని, కానీ ఆయన స్పందించలేదని చెప్పారు.

కాగా ఏక్ నాథ్ షిండే శాసనసభలో తమ గ్రూపు నాయకుడిగా కొనసాగుతారని పేర్కొంటూ శివసేన లెజిస్లేచర్ పార్టీ 37 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మద్దతు లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ కు పంపారు. శివసేన లెజిస్లేటివ్ పార్టీ చీఫ్ విప్ గా భరత్ గోగవాలేను నియమించినట్లు ఏక్ నాథ్ షిండే తెలిపారు. అయితే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని, మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గుతుందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ ఎంవీఏ ప్రభుత్వ భవితవ్యం గువాహటిలో కాకుండా అసెంబ్లీలోనే నిర్ణయించబడుతుంది. సభలో ఎంవీఏ తన మెజారిటీని నిరూపించుకుంటుంది ’’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.

Maharashtra crisis: మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం.. రెబ‌ల్స్ కు 40 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు

శ‌ర‌ద్ ప‌వార్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత నారాయణ్ రాణే మండిపడ్డారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను పవార్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విష‌యంలో ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘‘ మేము అలాంటి బెదిరింపులకు భయపడము. మేము చట్టం ప్రకారం నడుచుకుంటుంన్నాం. ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా మాతో చేరారని వారి అఫిడవిట్‌లు మా వద్ద ఉన్నాయి. మెజారిటీ సంఖ్య మా వద్ద ఉంది. 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలు, 12 మంది స్వతంత్రులు, ఇతరులు మాతో ఉన్నారు” అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. రూ.39 లక్షలు ఖాళీ చేసిన కొడుకు...

కాగా.. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ త‌న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. సంకీర్ణ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగిన సొంత వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేతో పాటు ముగ్గురు మంత్రులు, రెండు డ‌జ‌న్ల మంది ఎమ్మెల్యేలు ముంబ‌యిని విడ‌చి సూర‌త్ వెళ్తున్న విష‌యంలో సీఎంవో వ‌ద్ద కూడా స‌మాచారం లేదా? అంటూ సొంత నేత‌ల‌పై మండిప‌డ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios