Asianet News TeluguAsianet News Telugu

రెబెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద హైడ్రామా: శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్

గౌహాతిలోని ఓ హోటల్ లో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకొనేందుకు వెళ్లిన శివసేన సతారా జిల్లా డిప్యూటీ చీఫ్ సంజయ్ బోస్లేను పోలీసులు అరెస్ట్ చేశారు.శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు మాతోశ్రీ వద్దకు రావాలని ఆయన ప్ల కార్డులు ప్రదర్శించారు. 
 

 Shiv Sena Leader Sanjay Bhosale Arrest in Assam
Author
Assam, First Published Jun 24, 2022, 11:10 AM IST

గౌహతి: Assam  రాష్ట్రం రాజధాని గౌహాతిలో ఉన్న Shivsena  రెబెల్స్ ఎమ్మెల్యేలను కలుసుకొనేందుకు వెళ్లిన శివసేన నేత Sanjay Bhosale ను Police అరెస్ట్ చేశారు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను Matoshri వద్దకు  రావాలని ఆయన ప్లకార్డులను పట్టుకున్నారు.  Rebel ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన Hotel  వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. Maharashtra లోని సతారా జిల్లాలోని శివసేన  పార్టీ డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్నారు. శివసేన ఎమ్మెల్యేలకు ఎంతో చేసిందని సంజయ్ బోస్లే అభిప్రాయపడ్డారు. మాతోశ్రీకి ఎమ్మెల్యేలు ఏదైనా సేవ చేయాలని కూడా ఆయన కోరారు. 

 

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్  ప్రాంతం సున్నితమైన ప్రాంతమని పోలీసులు సంజయ్ బోస్లేకు చెప్పారు. చట్ట ప్రకారంగా సంజయ్ బోస్లేపై చర్యలు తీసుకొంటామని పోలీసులు ప్రకటించారు. బోస్లేను అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనకు  40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే శుక్రవారం నాడు ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా మాతో చేరారని వారి అఫిడవిట్‌లు మా వద్ద ఉన్నాయి. మెజారిటీ సంఖ్యలు మా వద్ద ఉన్నాయి.. 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలు మరియు 12 మంది స్వతంత్రులు మరియు ఇతరులు త‌మ‌తో ఉన్నారని ఏక్‌నాథ్‌ షిండే నొక్కిచెప్పారు.

also read:‘‘కొత్త పార్టీ పెట్టబోం.. పార్టీ మారబోం.. మేమే అసలైన శివ సైనికులం’’- ఏక్ నాథ్ షిండే

ఈ క్రమంలోనే తాము పార్టీ మారబోమని, కొత్త పార్టీ పెట్టబోమని శివ‌సేన రెబల్ నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే స్ప‌ష్టం చేశారు. తామే బాలాసాహెబ్ ఠాక్రే అస‌లైన శివ సైనికుల‌మ‌ని అన్నారు.  ప్ర‌భుత్వ ఏర్పాటుపై త‌మ‌తో క‌లిసి వున్న‌వారిపై త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. మూడు కూటమి భాగస్వాములు చివరి వరకు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నందున 30 నెలల మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)ని పడగొట్టడానికి బీజేపీ తిరుగుబాటును ప్రేరేపించిందని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ ఆరోపించాయి. రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి డాక్టర్.నితిన్ రౌత్ శుక్రవారం నాడు శివ‌సేన శ్రేణులలో తిరుగుబాటును ఇంజినీరింగ్ చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది అని ఆరోపించారు.

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ త‌న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. సంకీర్ణ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగిన సొంత వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఏక్‌నాథ్ షిండేతో పాటు ముగ్గురు మంత్రులు, రెండు డ‌జ‌న్ల మంది ఎమ్మెల్యేలు ముంబ‌యిని విడ‌చి సూర‌త్ వెళ్తున్న విష‌యం గురించి సీఎంవో వ‌ద్ద కూడా స‌మాచారం లేదా? అంటూ సొంత నేత‌ల‌ను ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios