మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన పిల్లలు తమ వెంట చిరుతలను పట్టుకొచ్చారు. అవి పిల్లి కూనలు అనుకొని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చి వాటితో ఆడుకున్నారు. చిరుతలు అరవడం మొదలు పెట్టిన తరువాత వారికి అసలు విషయం అర్థమైంది.
మధ్యప్రదేశ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అడవిలోకి మేకలను మేతకు తీసుకెళ్లిన పలువురు వ్యక్తులు అక్కడ చిరుత పిల్లలను గమనించారు. అయితే వాటిని పిల్లి కూనలు అని భావించి వారి వెంట గ్రామంలోకి తీసుకొచ్చారు. వాటికి ఆహారాన్ని అందించారు. అయితే ఆ పిల్లలు అరవడం ప్రారంభించిన వెంటనే వారు తమ తప్పును గ్రహించారు. అవి పిల్లి పిల్లలు కావని, చిరుతలు అని నిర్ధారించుకొని ఆటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారిణి ప్రియ... నలుగురు డాక్టర్లపై కేసు నమోదు...
వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాణి రూపమతి ప్రాంతంగా పిలిచే మండు అడవిలో కొంతమంది పిల్లలు గురువారం మేకలను మేత కోసం తీసుకువెళ్లారు. అక్కడ రెండు చిరుత పిల్లలను గమనించారు. అయితే వాటిని పిల్లి పిల్లలు అనుకున్నారు. వాటితో ఆడుకుంటూ తమ వెంట ఇంటికి తీసుకొచ్చారు. ఆ పిల్లలకు బిస్కెట్లు, ఇతర ఆహార పదర్థాలు అందించారు.
ఈ క్రమంలో స్థానికులు వాటిని వీడియో కూడా తీశారు. అయితే ఈ సమయంలో అవి అరవడం మొదలు పెట్టాయి. అప్పుడు ఆ మేకల కాపరులు తమ పొరపాటును గుర్తించారు. తాము తీసుకొచ్చినవి చిరుత పిల్లలు అని తెలుసుకున్నారు. దీనిని తల్లిదండ్రులకు చెపారు. వారు ఈ విషయాన్ని వెంటనే ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ధార్ అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత పిల్లలను తీసుకెళ్లి.. వాటిని తీసుకొచ్చిన స్థలంలోనే వదిలిపెట్టారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ, సోనియా, రాహుల్
ఆ ప్రాంతంలో ఎలాంటి కదలికలు, అలజడి లేకుండా చూసుకొని నిఘా పెట్టారు. అయితే శుక్రవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో చిరుతలు కనిపించలేదు. దీంతో తల్లి చిరుత వచ్చి పిల్లలను తన వెంట తీసుకెళ్లిందని ప్రకటించారు. ‘‘మేము గురువారం రాత్రికి ఖచ్చితమైన ప్రదేశాలలో పిల్లలను వదిలివేశాం. శుక్రవారం తెల్లవారుజామున అవి అక్కడ లేవు. మేము కూడా ఆ ప్రదేశంలో సోదాలు నిర్వహించాం. కానీ అక్కడ చిరుత పిల్లలు లేదా మరే ఇతర అడవి జంతువుల ఆనవాలు కనిపించలేదు ’’అని ధార్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఎస్‌డీవో ఎస్‌కే రాన్‌షోర్ తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.
పరువు హత్య : చంపి, జననాంగాలు కోసి.. రాజస్థాన్ లో జంట దారుణ హత్య..
ఈ విషయంపై ఎస్‌డీవో ఎస్‌కే రాన్‌షోర్ మాట్లాడుతూ.. ఆ చిరుత పిల్లలు ఒక నెల వయస్సులో ఉన్నాయని, రెండూ ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం అటవీ భూమి, వన్యప్రాణుల నివాసం కాబట్టి జంతువుల కదలికలు ఉంటాయని చెప్పారు. కాగా.. ఈ పరిసర ప్రాంతంలో అడవి జంతువుల వల్ల తరచూ పశువులు, ఇతర పెంపుడు జంతువులు మృత్యువాత పడుతున్నాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇలా ఐదు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
