గెలుపే లక్ష్యం.. నాగర్కర్నూల్ లో మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం..
Lok Sabha Elections 2024 - PM Modi : లోక్‌సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి నాగర్ కర్నూల్ లో బహిరంగ సభకు విచ్చేశారు.
General Elections 2024 : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్ లో బహిరంగ సభతో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్పలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
నాగర్ కర్నూల్ బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నాటక వెళ్లనున్నారు. అక్కడ కూడా ప్రధాని మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మళ్లీ ఈ నెల 18న కూడా ప్రధాని మోడీ తెలంగాణకు ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. నెల క్రితం కూడా దక్షిణాధి రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు. తన పర్యటన సందర్భంగా బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మోడీ కార్యక్రమాలు చూస్తుంటే ఈసారి దక్షిణాది సీట్లపైనే ఆయన ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఢిల్లీ ఈడీ ఆఫీసులో కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడం గమనార్హం. మార్చి 15 నుంచి దక్షిణాదిలో ఐదు రోజుల పర్యటనను ప్రధాని ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించి మోడీ తన ప్రచార సభలను ప్రారంభించారు. ఆ తర్వాత కేరళ, తెలంగాణలో కూడా ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించారు. కేరళలో గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయేలు తమ ఖాతాలను కూడా తెరవలేకపోయాయి. తమిళనాడులో బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేరు. ఇక 2019లో తెలంగాణలో బీజేపీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.
రాజకీయ కక్ష.. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోంది.. బీజేపీ పై కేటీఆర్ ఫైర్