Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీని వణికిస్తున్న పొగమంచు.. 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలువిమానాలు, రైళ్లు రద్దు...

ఢిల్లీలో దట్టమైన పొగమంచు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గత శుక్రవారం నుంచి రోజురోజుకూ పెరుగుతున్న పొగమంచుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 

The fog that is shaking Delhi, Temperatures dropped to 3 degrees, Many flights and trains cancelled - bsb
Author
First Published Jan 16, 2024, 8:52 AM IST

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని మంగళవారం కూడా దట్టమైన పొగమంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఢిల్లీ గజగజా వణికిపోతోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, దేశ రాజధానిలో సఫ్దర్‌జంగ్‌లో 4.8 డిగ్రీల సెల్సియస్, పాలంలో ఉష్ణోగ్రత 7.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

వాతావరణశాఖ కూడా పాలం విమానాశ్రయంలో ఉదయం ఏడుగంటల సమయంలో పొగమంచుతో కేవలం వంద మీటర్ల వరకే విజిబులిటీ ఉందని నివేదించింది. కానీ,  అరగంటకే దీని విజిబులిటీ జీరో మీటర్లకు పడిపోయింది. సఫాద్‌జంగ్ విమానాశ్రయంలో, ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు దృశ్యమానత 50 మీ.లకు పడిపోయింది.

విజిబిలిటీ తగ్గిపోవడంతో, ఢిల్లీ నుంచి బయలుదేరే దాదాపు 30 విమానాలు ఆలస్యమవగా, మరో 17 విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. దాదాపు 30 రైళ్లు కూడా మంగళవారం ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్నాయి.

ఇండిగో విమానంలో పైలెట్ ను చెంపదెబ్బ కొట్టిన ప్రయాణీకుడు అరెస్ట్.. అసలేం జరిగిందంటే...

ఇదిలా ఉండగా, మంగళవారం దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యం అవ్వడంతో ఢిల్లీ విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్ మరియు పంజాబ్‌లలో రేపటి (మంగళవారం) వరకు చాలా దట్టమైన పొగమంచు కొనసాగుతుందని సోమవారం వాతావరణ శాఖ ఉదయం బులెటిన్ తెలిపింది. అంతేకాకుండా, మంగళవారం వరకు ఉత్తర భారతదేశం అంతటా చలి నుండి తీవ్రమైన చలి పరిస్థితులు కూడా అంచనా వేయబడ్డాయి.

జనవరి 15 నాడు కూడా ఈ శీతాకాలంలో అత్యంత ఎక్కవ చలి నమోదైంది, ఎందుకంటే జాతీయ రాజధాని అధికారిక వాతావరణ అబ్జర్వేటరీ అయిన సఫ్దర్‌జంగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.3°Cకి పడిపోయింది. ఢిల్లీలోని మరో వాతావరణ పర్యవేక్షణ కేంద్రమైన లోధి రోడ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఆదివారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో 3.5°C, లోధి రోడ్‌లో 3.4°C కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుండి ఢిల్లీలో చలి 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంది. దీంతో స్థానికులు గజగజా వణికిపోతున్నారు. చలినుంచి కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

పంజాబ్, హర్యానాలోనూ..
ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా, మూడు విమానాలు రద్దు చేయబడ్డాయి, మరో మూడు చండీగఢ్‌లో ఆలస్యం అయ్యాయి. ఇదిలా ఉండగా, నగరంలోని ప్రాథమిక పాఠశాలలను జనవరి 20 తర్వాత మూసివేయాలని ఆదేశించారు. అయితే, 10, 11, 12 తరగతుల పాఠశాలలు ఉదయం 9.30 గంటల తర్వాత తెరుస్తారు.

విపరీతమైన చలి పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జనవరి 16 (నేడు) వరకు పేర్కొన్న రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతాయని కూడా పేర్కొంది. సోమవారం, రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios