ఇండిగో విమానంలో పైలెట్ ను చెంపదెబ్బ కొట్టిన ప్రయాణీకుడు అరెస్ట్.. అసలేం జరిగిందంటే...

విమానం ఆలస్యం అవ్వడంతో...ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల కారణంగా సిబ్బందిని భర్తీ చేసిన ఫ్లైట్ కో-కెప్టెన్ అనుప్ కుమార్‌ను కొట్టాడు. 

Passenger who slapped pilot in Indigo flight was arrested, What actually happened - bsb

న్యూఢిల్లీ : ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యం కావడంతో రెచ్చిపోయాడు. విమాన ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తున్న పైలట్‌పై భౌతికంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-2175) పొగమంచు కారణంగా చాలా గంటలు ఆలస్యమైంది. 

దీంతో విసిగిపోయిన ప్రయాణికుడు ఇలా తెగించాడు. ఆ ప్రయాణికుడిని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వైరల్ వీడియోలో, పసుపు రంగు హూడీలో ఉన్న ఓ వ్యక్తి చివరి వరుస నుండి సడెన్ గా ముందుకు పరిగెత్తుకొచ్చాడు. విమానం ఆలస్యం అవ్వడంతో...ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల కారణంగా సిబ్బందిని భర్తీ చేసిన ఫ్లైట్ కో-కెప్టెన్ అనుప్ కుమార్‌ను కొట్టాడు. 

ఎఫ్ డిటీ అంటే పైలట్‌లు,ఫ్లైట్ అటెండెంట్‌ల శ్రేయస్సును నిర్ధారించడానికి తగిన విశ్రాంతి కాలాలను తప్పనిసరి చేయడం, అలసట-సంబంధిత భద్రతా సమస్యలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. దీని ప్రకారమే సిబ్బందిమార్పును పైలెట్ అనౌన్స్ చేస్తున్నాడు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రయాణికుడిని విమానం నుంచి బయటకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు.

Deep Fake Issue : డీప్ ఫేక్ పై కేంద్రం సీరియస్.. కఠిన చట్టాలు తీసుకొస్తామన్న హామీ..

ఈ వీడియోను షేర్ చేసూ ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. "ఆలస్యానికి పైలట్ లేదా క్యాబిన్ సిబ్బంది ఏంచేస్తారు? వారు తమ పని తాము చేస్తున్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి, అతనిని నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చండి. ఆ వ్యక్తి ఫొటో షేర్ చేయడం ద్వారా.. అతనెలాంటి వ్యక్తో జనాలకు తెలుస్తుంది’ అని రెస్సాండ్ అయ్యాడు. 

ఫ్లైట్ ట్రాకర్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం, ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన రోజు 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 79 విమానాలు రద్దు చేశారు. ప్రతికూలవాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే అనేక విమానాలు తీవ్ర ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్ విస్తారా వంటి ప్రధాన విమానయాన సంస్థలు ఢిల్లీ, కోల్‌కతాలో కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన షెడ్యూల్‌లపై మరింత ప్రభావం చూపుతాయని హెచ్చరించాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios