బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రైల్వే స్టేషన్‌ లో వందే భారత్ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఇది మనదేశంలో ఐదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీస్.

దక్షిణ భారతదేశానికి కేటాయించిన తొలి వందే భారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రైల్వే స్టేషన్‌ దీనికి వేదిక అయ్యింది. ఈ రైలు మైసూరు-చెన్నై మార్గంలో ప్రయాణించనుంది. ఈ సర్వీస్ ప్రారంభంతో దక్షిణ భారతదేశం ప్రజా రవాణా అభివృద్ధిలో భారీ పురోగతి సాధించినట్లైంది.

శశికళ వదిన ఇలవరసి కోడలు కీర్తన ఆత్మహత్యాయత్నం.. వివేక్ మీద బిగుస్తున్న ఉచ్చు...

ఈ సందర్భంగా రైల్వేల ‘భారత్ గౌరవ్’ రైలు విధానం కింద కర్ణాటక ముజ్రాయ్ శాఖ నిర్వహిస్తున్న ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. నైరుతి రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. కాశీ యాత్రను చేపట్టాలనుకునే అనేక మంది ప్రయాణికుల కలలను ఇది నెరవేర్చనుంది. ఈ రైలు యాత్రికుల కోసం రాయితీ ధరలతో ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీని అందించనుంది. ఈ రైలు వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్ వంటి పవిత్ర స్థలాల గుండా ప్రయాణిస్తుంది.

బార్డర్ లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవు - విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

ఈ తాజా సర్వీస్ భారత్ లో ఐదో వందే భారత్ రైలు. దక్షిణాదిలో మొదటి సెమీ-హై స్పీడ్ రైలు. రైల్వే అధికారులు ప్రకారం.. వందే భారత్ రైలు వేగం, ఇతర అధునిక టెక్నాలజీ పరంగా, సౌకర్యాల పరంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ప్రయాణీకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది ప్రయాణ సమయాన్ని 25 శాతం నుండి 45 శాతం వరకు తగ్గిస్తుంది. ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించిన సర్వీసు వల్ల ప్రయాణికులు మూడు గంటల్లో బెంగళూరు నుండి చెన్నైకి చేరుకుంటారు. 

Scroll to load tweet…