ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ను కానిస్టేబుల్ కొట్టిన వీడియో వైరల్ గా మారడంతో అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. నిందితుడిని సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. బాధితుడితో డీజీపీ ఫోన్ లో మాట్లాడారు. 

కోయంబత్తూర్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ ను చెంప‌దెబ్బ‌లు కొట్టినందుకు ఓ పోలీసును అరెస్టు చేశారు. అత‌డిని విధుల నుంచి స‌స్పెండ్ కూడా చేశారు. బాధితుడికి త‌మిళ‌నాడు డీజీపీ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. అత‌డి ఆరోగ్య స‌మాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ పై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని బాధితుడికి వివ‌రించారు. 

అసలేం జ‌రిగిందంటే.. ? 
38 ఏళ్ల బాధితుడు మోహ‌న్ సుంద‌రం రెండేళ్లుగా స్విగ్గీలో డెలివ‌రీ బాయ్ గా ప‌ని చేస్తున్నాడు. రోజూలాగే త‌న విధుల్లో భాగంగా అవినాశి రోడ్డులో శుక్ర‌వారం బైక్ పై ప్ర‌యాణిస్తున్నాడు. అయితే ఈ స‌మ‌యంలో ఓ స్కూల్ వ్యాన్ వేగంగా వ‌చ్చి వ‌చ్చింది. రెండు వాహ‌నాల‌ను, పాదచారుల‌ను ఢీకొట్టి వెళ్లింది. దీనిని గ‌మ‌నించిన మోహ‌న్ సుంద‌రం ఆ వ్యాన్ ఆపేందుకు ప్ర‌య‌త్నించాడు. చివ‌రికి దానిని ఆపాడు. అయితే ఈ క్ర‌మంలో అవినాశి రోడ్డు జంక్ష‌న్ లో స్ప‌ల్ప ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. 

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. అరబ్ దేశాల్లో ఆగ్రహావేశాలు.. భారత దూతకు ఖతర్ సమన్లు

దీంతో అదే ప్రాంతంలో విధులు నిర్వ‌హిస్తున్న సింగ‌న‌ల్లూర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ స‌తీష్ అక్క‌డికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ కార‌ణ‌మైన ఫుడ్ డెలివ‌రీ బాయ్ ను చెంప దెబ్బ‌లు కొట్టాడు. అత‌డి నుంచి ఫోన్ ను లాక్కున్నాడు. ఆ స్కూల్ వ్యాన్ య‌జ‌మాని ఎవ‌రో తెలుసా అని మోహ‌న సుంద‌రాన్ని ప్ర‌శ్నించాడు. అనుకోని ఈ చ‌ర్య‌ల‌కు పాపం ఆ డెలివ‌రీ బాయ్ బాధ‌ప‌డ్డాడు. ఇదంతా అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి వీడియో తీశాడు. ఫుడ్ డెలివ‌రీ బాయ్ ను కానిస్టేబుల్ కొడుతున్న దృశ్యాల‌న్నీ దాంట్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వీడియో సోష‌ల్ మీడియాలో విడుద‌ల కావ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. అంద‌రూ ఆ ఫుడ్ డెలివ‌రీ బాయ్ ప‌ట్ల సానుభూతి ప్ర‌క‌టించారు. 

Scroll to load tweet…

నెటిజ‌న్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది పోలీసు ఉన్న‌తాధికారుల‌కు చేరింది. ఇదే స‌మ‌యంలో బాధితుడైన మోహ‌న సుంద‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ స‌తీష్ పై కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అత‌డిని విధుల నుంచి తొల‌గించి, అరెస్టు చేశారు. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని డీజీపీ సి.శైలేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుడితో తాను ఫోనులో మాట్లాడాన‌ని తెలిపారు.