తనమీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడని ఓ కానిస్టేబుల్ దారుణానికి తెగబడ్డాడు. మూడేళ్ల తరువాత ఎస్సైని కిరాతకంగా హతమార్చాడు.
మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. మూడేళ్ల క్రితం నాటి పగను ఇటీవల తీర్చుకున్నాడో వ్యక్తి. తన పైఅధికారిని చంపి.. తన కక్ష సాధించాడు. అయితే, నిందితుడు కానిస్టేబుల్ కాగా, హతుడు సబ్ ఇన్స్పెక్టర్ కావడం ఈ ఘటనలో ట్విస్ట్. మూడేళ్ల క్రితం తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడని సబ్ ఇన్స్పెక్టర్ మీద పగ పెంచుకున్నాడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఒకరు. ఆ ద్వేషాన్ని పగగా మార్చుకుని మూడేళ్ల తర్వాత అతడిని చంపాడు.
ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇలా తెలియజేశారు. మూడేళ్ల క్రితం పంకజ్ యాదవ్ అనే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తన సహోద్యోగితో గొడవపడ్డాడు. దీనిమీద సబ్ ఇన్స్పెక్టర్ బసవరాజు ఆధ్వర్యంలో ఈ ఘటనకు సంబంధించిన విచారణ జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించిన బసవరాజ్ గార్గ్.. పంకజ్ చేసిన తప్పుకుగాను... అతని శాలరీలో కోత పెట్టాలని పై అధికారులకు సిఫార్సు చేశారు. దీంతో పంకజ్.. బసవరాజ్ గార్గ్ మీద అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు.
పెళ్లి విందులో పనీర్ కూర పెట్టలేదని.. బెల్టులతో కొట్టుకున్న వధూవరుల బంధువులు..
ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి బసవరాజ్ గార్గ్ గదిలోకి పంకజ్ దొంగచాటుగా చొరబడ్డాడు. ఆ తర్వాత అతని మీద కర్రతో దాడి చేసి చంపేశాడు. ఈ మేరకు అధికారులు వివరాలు తెలిపారు. గురువారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
