మరో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ప్రధానిపై మోడీపై పోటీ చేసేదెవరంటే ?

లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 45 అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు చోటు కల్పించింది. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసి నుంచి కూడా పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది.

The Congress has announced 45 candidates. Who is contesting against Modi against the Prime Minister?..ISR

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే ఒకే సారి కాకుండా విడతల వారీగా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మరో 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రముఖ నాయకులకు చోటు దక్కింది.

అందరూ అనుకున్నట్టుగానే రాజ్ గఢ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిపింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్న వారణాసి స్థానం నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయబోతున్నారు. సహరాన్ పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి వీరేందర్ రావత్, అమ్రోహా నుంచి డానిష్ అలీ, కాన్పూర్ నుంచి అలోక్ మిశ్రా తదితరుల పేర్లను పార్టీ ప్రకటించింది.

తమిళనాడులోని శివగంగ నుంచి కార్తీ చిదంబరం, విరుధ్ నగర్ నుంచి మాణికం ఠాగూర్, కరూర్ నుంచి ఎస్.జ్యోతిమణి పోటీ చేస్తున్నారు. యూపీఏ-2 మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియాను మధ్యప్రదేశ్ లోని రత్లాం (ఎస్టీ) నుంచి బరిలోకి దింపారు. కాంగ్రెస్ నాలుగో జాబితాలో అఖిలేష్ ప్రతాప్ సింగ్ (డియోరియా, యూపీ), పియా రాయ్ చౌదరి (కూచ్ బిహార్, పశ్చిమబెంగాల్), కవాసి లఖ్మా (ఛత్తీస్గఢ్), రామన్ భల్లా (జమ్మూ), సంజయ్ శర్మ (హోషంగ్బాద్, ఎంపీ), అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ (ఇన్నర్ మణిపూర్), లాల్బియాక్జామా (మిజోరం) పేర్లు ఉన్నాయి.

అయితే, 2004 నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి పార్టీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మొత్తంగా నాలుగో జాబితాలో మహారాష్ట్ర నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 9 మంది, తమిళనాడు నుంచి ఏడుగురు, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మణిపూర్ నుంచి ఇద్దరు చొప్పున, అసోం, అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్ గఢ్, మిజోరం, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరిని పార్టీ ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios