Asianet News TeluguAsianet News Telugu

రావ‌ణ‌ ద‌హ‌నంలో అప‌శృతి.. ఒక్క‌సారిగా కింద‌ ప‌డ్డ దిష్టిబొమ్మ.. ప‌లువురికి తీవ్రగాయాలు.. ఎక్క‌డంటే ?

దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా హర్యానాలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. 

The chaos in Ravana's cremation.. the effigy fell down at once.. many were seriously injured.. where is it?
Author
First Published Oct 6, 2022, 9:02 AM IST

హర్యానాలో యమునా న‌గ‌ర్ లో నిర్వ‌హించిన రావ‌ణ ద‌హ‌నంలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం రాత్రి స‌మ‌యంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంట‌ల‌తో ఉన్న దిష్టిబొమ్మ అనూహ్యంగా నేలపై పడింది. ఒక్క సారిగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న వ‌ల్ల పలువురికి గాయాలయ్యాయి.

ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయా? మాజీ భార్యతో రేప్ కేసులో కాంప్రమైజ్... భర్తకు ఢిల్లీ హైకోర్టు వెరైటీ పనిష్మెంట్...

దసరా సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రావ‌ణ ద‌హ‌నం నిర్వ‌హిస్తుంటారు. యమునానగర్ లో కూడా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనిని చూసేందుకు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి జ‌నం పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. అయితే ఆ దిష్టిబొమ్మ స‌గం కాలిన త‌రువాత ఒక్క సారిగా కింద ప‌డింది. దీంతో అక్క‌డున్న జ‌నం ఒక్క సారిగా భ‌యబ్రాంతుల‌కు గుర‌య్యారు. ఏం జ‌రిగిందో అర్థం కాక ప‌రుగులు తీశారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌గా మహిళను నియమిస్తారా?: మోహ‌న్ భ‌గ‌వ‌త్ ను నిల‌దీసిన దిగ్విజయ్‌సింగ్

ఈ ప్ర‌మాదంలో అక్క‌డే రావ‌ణ ద‌హ‌నాన్ని చూస్తున్న ప‌లువురికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారంతా హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా దసరా పండుగను జరుపుకున్నారు.

విజయదశమి రోజున తొమ్మిది రోజుల పాటు సాగిన నవరాత్రి ముగింపున‌కు రావడంతో, లేహ్, లూధియానా, డెహ్రాడూన్, పాట్నా, అమృత్ స‌ర్ తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని ప్రజలు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios