ట్రక్కును ఢీకొన్న బస్సు.. 55 మందికి గాయాలు.. ఎక్కడంటే ?
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 70 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఇందులో ఉన్న 55 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఓ ట్రక్కును బస్సును ఢీకొంది. దీంతో 55 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో 47 మంది స్కూల్స్, కాలేజీలకు చెందిన స్టూడెంట్లే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇంటికి పంపించారు. వాడా తహసీల్ లోని దేశాయ్ గ్రామ సమీపంలో ఉదయం 6.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ ఆర్ టీసీ) అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు పాల్ఘర్ జిల్లాలోని చించ్పాడా-వాడా సర్వీసు అందిస్తోంది. ఈ బస్సులో ప్రతీ రోజు వివిధ పనుల నిమిత్తం వాడాకు వెళ్లేవారు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ ప్రయాణిస్తుంటారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం కూడా ఈ బస్సు సర్వీసు ఉదయం ప్రారంభించింది. అయితే వాడా తహసీల్ లోని దేశాయ్ గ్రామ సమీపంలోకి చేరే సరికి ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీకొట్టింది.
ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల మొత్తంగా 55 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందులో 47 మంది స్టూడెంట్లు ఉండగా.. మిగితా 8 మంది ఇతరులు ఉన్నారు. కాగా.. ఈ సమాచారం తెలిసిన వెంటనే క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాలు, అంబులెన్స్ ల ద్వారా హాస్పిటల్స్ కు తరలించారు. వారికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని ఇంటికి పంపించారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని, ఈ బస్సులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీసులు తెలిపారు.