యూపీలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారు. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కాన్పూర్ దేహత్ ప్రాంతంలోని హర్మౌ బంజారదేరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కాన్పూర్ దేహత్ ప్రాంతంలోని ఓ గుడిసెలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజారదేరా గ్రామంలో చోటుచేసుకుంది.

హౌరా - న్యూ జల్పాయిగురి వందే భారత్ రైలుపై మరో సారి రాళ్ల దాడి.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

వివరాలు ఇలా ఉన్నాయి. బంజారదేరా గ్రామంలో సతీష్ కుమార్ తన భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే వీరంతా ఆదివారం రాత్రి గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఏమయిందో తెలియదు గానీ ఆ గుడిసెకు ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులంతా సజీవంగానే దహనం అయ్యారు. 

స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు చాలా కష్టపడ్డారు. అయినా ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయారు. ఈ అగ్నిప్రమాదంలో సతీష్ తల్లికి కూడా గాయాలు అయ్యాయి. అయితే ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.

"ఆ సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది, బిజెపి అనుసరిస్తోంది...": అఖిలేష్ యాదవ్

సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పైకప్పుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. 

డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా .. 3 కిలోల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

‘‘సతీష్, అతడి కుటుంబం మంటల్లో సజీవదహనమైనట్లు మాకు సమాచారం అందింది. ఫోరెన్సిక్ బృందాన్ని, అగ్నిమాపక శాఖ అధికారులను, డాగ్ స్క్వాడ్ బృందాన్ని పిలిపించి దర్యాప్తునకు ఆదేశించాం. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు’’ అని కాన్ పూర్ దేహత్ ఎస్పీ ‘ఇండియా టుడే’కు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సతీష్ తల్లిని జిల్లా హాస్పిటల్ లో డీఎం నేహా జైన్ పరామర్శించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు.