Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ, అక్రమ సంబంధాల కోసమే ఎక్కువ ‘‘హత్య’’లు .. దేశంలో యూపీ టాప్

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా ఇయర్ 2020’ నివేదిక వెల్లడించింది. గతేడాది దేశంలో నమోదైన 29,193 హత్యల్లో 3,031 హత్యలు ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవేనని పేర్కొంది.  

thats how love kills in india literally 3031 murders were motivated by love affairs
Author
New Delhi, First Published Sep 18, 2021, 8:00 PM IST

భూమి, డబ్బు, మనస్పర్ధలు, గొడవలు, పాత కక్షలతోనే గతంలో హత్యలు జరిగివే. అయితే ఈ మధ్యకాలంలో దేశంలో ప్రేమ కోసం కూడా మర్డర్లు జరుగుతున్నాయని తాజా నివేదిక ఒకటి తేటతేల్లం చేసింది.  దేశంలో ప్రతిరోజూ సగటున 80 హత్యలు జరుగుతుంటే.. అందులో ఎక్కువ శాతం ‘ప్రేమ’తో ముడిపడి ఉన్నవేనని నివేదిక తెలిపింది. ఓ హత్య జరిగిందంటే దాని వెనుక ప్రేమ వ్యవహారమో, లేక అక్రమ సంబంధానికి సంబంధించిన పరిణామాలో ఉండే అవకాశాలే ఎక్కువగా వున్నాయట. ఏదైనా హత్య జరిగితే మొదట పోలీసుల దర్యాప్తు సైతం ఆ కోణంలోనే సాగుతుంది.  

ప్రేమ విఫలైందని కోపంతో ప్రియురాలిని చంపడం లేదంటే ఇతరులతో సన్నిహితంగా మెలుగుతోందని కక్ష పెంచుకొని హత్య, ఇష్టం లేని వ్యక్తితో వెళ్లిపోయిందని అమానుషం. ఇవేకాకుండా దేశంలో అక్రమ సంబంధాలతో హత్యలు కూడా అధికమే. ఈ విషయాన్నే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా ఇయర్ 2020’ నివేదిక వెల్లడించింది. గతేడాది దేశంలో నమోదైన 29,193 హత్యల్లో 3,031 హత్యలు ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవేనని పేర్కొంది.  

ఈ తరహా హత్యలు 2010-2014 కాలంలో 7-8 శాతం మాత్రమే ఉండేవని.. కానీ ప్రస్తుతం అది 10-11 శాతానికి పెరిగిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. ఈ హత్యలకు దేశంలో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా.. బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో నమోదవుతున్న హత్యల్లో 15 శాతం ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా తక్కువగా నమోదవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios