హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయిన బిపిన్ రావత్ కు దేశం నివాళి అర్పిస్తోంది. సైనిక లాంఛనాల మధ్య నేడు ఆయన అంతక్రియలు జరుగుతున్నాయి. 

బిపిన్ రావ‌త్..ఈ పేరు మూడు రోజుల నుంచి దేశ మొత్తం స్మ‌రించుకుంటోంది. హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ బిపిన్ రావ‌త్ దేశ‌నికి ఎంతో సేవ చేశారు. సుధీర్ఘ కాలం పాటు దేశ ర‌క్ష‌ణ‌కు పాటుప‌డ్డాడు. అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందార‌న్న వార్త దేశం మొత్తం క‌ల‌క‌లం సృష్టించింది. దేశ పార్ల‌మెంట్ ఆయ‌న‌కు నివాళి అర్పించింది. ఈ రోజు బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. బిపిన్ రావ‌త్ వీర‌మ‌ర‌ణం పొందినా.. ఆయ‌న జ్ఞాప‌కాల‌ను దేశం మొత్తం గుర్తు చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన మాట‌ల‌ను దేశ ప్ర‌జ‌లు మ‌న‌నం చేసుకుంటున్నారు.

‘అగ్గిపెట్టె’ జవాబు మార్చుకోవాల‌ని ఒత్తిడి చేశారు..
బిపిన్ రావ‌త్ ఆర్మీకి ఎంపిక‌య్యే సంద‌ర్భంలో జ‌రిగిన విష‌యాన్ని రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ఓ చిట్ చాట్‌లో స్టూడెంట్ల‌తో ఆయ‌న పంచుకున్నారు. ఇండియ‌న్ ఆర్మీలో ఆఫీస‌ర్స్‌గా వెళ్లాలంటే కొన్ని ప‌రీక్ష‌లు ఇంట‌ర్వ్యూలో రాయాల్సి ఉంటుంది. అందులో యూపీఎస్సీ ఒక‌టి. ఈ ప‌రీక్ష‌లో బిపిన్ రావ‌త్ పాస్ అయ్యారు. త‌రువాత ఇంట‌ర్వ్యూకి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న చెప్పిన స‌మాధాన‌మే ఆయ‌న‌ను ఆర్మీకి ఎంపిక‌య్యేలా చేసింది. ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌లు, అక్క‌డ అధికారుల తీరు మొత్తం ఆయ‌న స్టూడెంట్ల‌తో పంచుకున్నారు. ‘‘నేను ఇంట‌ర్వ్యూ హాల్‌లోకి ప్ర‌వేశించాక‌.. అక్క‌డి అధికారులు న‌న్ను ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. వాటికి నేను స‌మాధానాలు చెప్పారు. త‌రువాత నా అభిరుచులు చెప్ప‌లాని అడిగారు. నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్ట‌మ‌ని అధికారుల‌తో చెప్పాను. దానికి అనుబంధంగా వారు న‌న్ను మ‌రో ప్ర‌శ్న అడిగారు. వ‌రుస‌గా కొన్ని రోజులు ఒక వేళ ట్రెక్కింగ్ వెళ్సాల్సి వ‌స్తే ఏం తీసెళ్తావు అని అడిగారు. నేను ఒక అగ్గిపెట్టె తీసుకెళ్తాన‌ని చెప్పాను. అగ్గిపెట్టె తీసుకెళ్లేందుకు కార‌ణాలు చెప్ప‌మ‌ని అడిగారు. నేను చెప్పాను. ఆదిమానవుల కాలం నుంచి ప్ర‌స్తుతం ఉన్న మాన‌వునిగా ప‌రిణామం చెందేందుకు అగ్ని ఎంత‌గానో దోహ‌దం చేసింది. అందుకే నేను అగ్గిపెట్టెను తీసుకెళ్తాన‌ని చెప్పాను. నా స‌మాధానికి అధికారులు సంతృప్తి చెంద‌లేదు. స‌మాధానం మార్చుకోవాల‌ని ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా నేను ఆ స‌మాధానం మార్చుకోలేదు. త‌రువాత ఇంటికి వెళ్లాను. కొన్ని రోజుల త‌రువాత నేను ఇండియ‌న్ ఆర్మీకి ఎంపికైన‌ట్టు లెటర్ వ‌చ్చింది. త‌రువాత సైన్యంలో చేరాను. ఒత్తిడి వ‌ల్ల నేను స‌మాధానం మార్చుకోక‌పోవ‌డ‌మే న‌న్ను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చింది’’ అని బిపిన్ రావత్ చిన్నారులతో తన అనుభవాన్ని పంచుుకున్నారు. 

హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలకు దూరంగా ఉండాలి.. వైమానిక దళం ప్రకటన

నేడు అంత్యక్రియలు..
హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన 13 మంది అంత్య‌క్రియ‌లు నేడు జ‌రుగుతున్నాయి. సీడీఎస్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధుళిక రావ‌త్ కు సైనిక లాంఛ‌నాల మ‌ధ్య అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. ఆర్మీలో అన్ని ర్యాంకుల‌కు చెందిన అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ప్ర‌మాదంలో మృతి చెందిన సైనికుల కుటుంబాల‌కు దేశం మొత్తం శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తోంది. హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్ క‌మాండ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌నకు డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నారు.