తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం (Army Chopper Crash) దేశంలోని ప్రతిఒక్కరిని కలిచివేసింది. అయితే ఈ ఘటనపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని భారత వైమానిక దశం (indian air force) ప్రజలను కోరింది.

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం (Army Chopper Crash) దేశంలోని ప్రతిఒక్కరిని కలిచివేసింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ (General Bipin Rawat), ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటుగా 13 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ప్రాణాలతో బయటపడిని గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తితో ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదానికి.. వాతావరణ పరిస్థితులే కారణమా..?, సాంకేతిక లోపం వల్లే జరిగిందా..?, ఏమైనా కుట్రం కోణం దాగి ఉందా అనే ప్రశ్నలు కొందరు లెవనెత్తుతున్నారు. 

ఈ క్రమంలోనే భారత వైమానిక దశం (indian air force).. కీలక ప్రకటన చేసింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రమాదంపై విచారణను త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు వైమానిక దళం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 

Also Read: CDS Bipin Rawat funerals: బిపిన్ రావత్ దంపతులకు నివాళులర్పించిన అమిత్ షా, రాహుల్ గాంధీ..

"2021 డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి ఇండియన్ ఎయిర్‌పోర్స్.. ట్రై-సర్వీస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని వేసింది. విచారణ త్వరితగతిన పూర్తి చేయబడుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు.. ప్రమాదంలో మరణించినవారి మర్యాదను గౌరవించటానికి.. ఎటువంటి సమాచారంల లేని ఊహాగానాలకు దూరంగా ఉండండి" అని ట్విట్టర్‌ వేదికగా భారత వైమానిక దళం ప్రకటన చేసింది. 

Scroll to load tweet…

ఇక, ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలం నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసున్న సంగతి తెలిసిందే. ఘటన స్థలానికి 300 మీటర్ల దూరంలో ప్రత్యేక బృందం బ్లాక్ బాక్స్‌ను గుర్తించింది. దానిని విశ్లేషణ నిమిత్తం తరలించారు. మరోవైపు ప్రమాద ఘటనపై విచారణ మొదలైందని ఇప్పటికే అధికారులు తమిళనాడుకు చేరుకున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మంగళవారం పార్లమెంట్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిపిందే. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సిగ్ నేతృత్వంలో త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్టుగా తెలిపారు.