తల లేకుండా..  ఓ మహిళ మృతదేహం కలకలం రేగింది. మహిళ మృతదేహాన్ని తల లేకుండా చేసి సూట్ కేసులో ఉంచారు. ఈ సంఘటన మహారాష్ట్ర థాన్ జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా... సదరు యువతిని కన్న తండ్రే చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. యువతి తండ్రిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదివారం కళ్యాణ్ ప్రాంతంలో పోలీసులు ఓ సూట్ కేసును గుర్తించారు. అందులో మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహం ఒక స్త్రీది అన్న విషయం గుర్తించేవిధమైన పార్ట్స్ మాత్రమే అందులో ఉన్నాయి. తల, మెడ, ఛాతి భాగాలకు సంబంధించిన పార్ట్స్ కూడా అందులో లేవు. సదరు మహిళ తండ్రి.. ఆమెను హత్య చేసిన తర్వాత.. శరీరభాగాన్ని ఓ బ్యాగ్ లో పెట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు.

AlsoRead కన్న కూతురిపై ఏడాదిగా సామూహిక అత్యాచారం.. కన్నతల్లే దగ్గరుండి.

ఓ ఆటోరిక్షాలో అక్కడికి  వచ్చినట్లు తెలుస్తోంది. అతని బ్యాగ్ నుంచి భరించలేని కంపు వాసన వచ్చిందని ఆటో రిక్షా డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. కాగా... అతను చెప్పిన వివరాల ఆధారంగా.. పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

నిందితుడు అరవింద్ తివారి(47)గా గుర్తించారు. అతను అంథేరీలో ఉద్యోగంచేస్తున్నాుడ. ఆయనకు 22సంవత్సరాల కూతురు ఉండగా... ఆమె ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమను అరవింద్ తివారి అంగీకరించలేదు. ఈ క్రమంలో కూతురు తన మాట వినడం లేదనే కోపంతో.. కూతురిని హత్య చేశాడు. అనంతరం ముక్కలు ముక్కులుగా నరికి వివిధ ప్రాంతాల్లో పడేశాడు.

కాగా... మహిళ ఇతర శరీర భాగాలను, ఆమె శరీరాన్ని కోయడానికి ఉపయోగించిన పరికరం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.