జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. బుధవారం షోపియాన్ జిల్లాలో ఓ సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపిన ఉగ్రమూక.. తాజాగా బుద్గాం జిల్లా చదూరాలో ఇద్దరు కార్మికులను కాల్చింది. దీంతో ఒకరు మరణించారు. 

ఉగ్ర‌వాదులు మ‌ళ్లీ రెచ్చిపోయారు. అమాయకులైన సాధార‌ణ పౌరుల‌పై కాల్పులు జ‌రుపుతున్న ఘ‌ట‌నలు ఇటీవ‌ల కాలంలో పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం కూడా ఉగ్ర‌వాదులు ఇలాంటి దుశ్చ‌ర్య‌కే పాల్ప‌డ్డారు. జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లా చదూరా ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇద్దరు స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే వారిని వెంట‌నే స్థానికులు హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అయితే అందులో ఒక‌రు చ‌నిపోయారు. 

‘‘ బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలోని ఇటుక బట్టీలో పని చేస్తున్న ఇద్ద‌రు బ‌య‌టి కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు మరణించారు ’’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్ జోన్) విజయ్ కుమార్ ట్వీట్ లో పేర్కొన్నారు. మృతులను బిహార్లోని అర్నియా ప్రాంతానికి చెందిన దిల్కుష్ కుమార్, పంజాబ్ కు చెందిన రాజన్ గా పోలీసులు గుర్తించారు. 

తెలంగాణ‌కు ప్ర‌ధాని రూ. 2,52,202 కోట్లు ఇచ్చారు.. స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూప‌లేదు - అమిత్ షా

వీరిద్దరిపై కాల్పులు జరిగిన తరువాత హస్పిటల్ కు తరలించినా.. అక్కడ కుమార్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మరణించారు. మరో వ్యక్తి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. ఈ ఘ‌ట‌న త‌రువాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన ఉగ్రవాదుల కోసం వెతకడం ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

fire accident : గుజరాత్‌లోని వడోదరలో భారీ పేలుడు.. దీపక్ నైట్రేట్ కంపెనీలో చెలరేగిన మంటలు

అయితే ఈ ఉగ్రవాద దాడికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి అధికారులు పనిచేస్తున్నారు. కుల్గాం జిల్లాలో రాజస్థాన్ కు చెందిన బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపిన కొన్ని గంటల తరువాత ఈ సంఘటన జరిగింది. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ (29)ను నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది గురువారం ఉదయం దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలోని తన కార్యాలయ ఆవరణలో కాల్చి చంపారు. జిల్లాలోని అరేహ్ మోహన్పోరా శాఖలో ఎల్లాకి దేహతి బ్యాంకు (ఇడీబీ) లో మేనేజర్ గా ప‌ని చేస్తున్న కుమార్ ప‌ని చేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి లోయ ప్రాంతంలో ల‌క్షిత దాడిలో భాగంగా జ‌రిగిన ఈ హ‌త్య ఎనిమిద‌వ‌ది. అలాగే ముస్లిమేతర ప్రభుత్వ ఉద్యోగిలో ఈ ఘ‌ట‌న మూడవది.

Targeted Killings: కశ్మీరీ పండిట్ల ఆందోళన.. కశ్మీర్ విడిచి వెళ్లిపోతాం

కాగా.. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని రఖ్-ఏ-చిద్రెన్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక పౌరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బాధితుడిని షోపియాన్‌లోని కీగామ్ ప్రాంతంలోని రఖ్-ఎ-చిద్రెన్‌కు చెందిన గులాం నబీ షేక్ కుమారుడు ఫరూక్ అహ్మద్ షేక్ గా పోలీసులు గుర్తించారు. అత‌డిని ల‌క్ష్యంగా చేసుకొని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపార‌ని పోలీసులు తెలిపారు. గాయాల‌పాలైన ఫరూఖ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అయితే అత‌డి కాలికి గాయమైందని, ఆసుపత్రిలో చేర్చామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.