గుజరాత్ రాష్ట్రం వడోదరలోని దీపక్ నైట్రేట్ కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మందికి గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

గుజరాత్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని దీపక్ నైట్రేట్ కంపెనీలో గురువారం సాయంత్రం ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంట‌లు చెల‌రేగాయి. నందేసరి జీఐడీసీ (గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లోని కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత పేలుడు సంభవించింది.

Targeted Killings: కశ్మీరీ పండిట్ల ఆందోళన.. కశ్మీర్ విడిచి వెళ్లిపోతాం

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. సంఘటన స్థలం వెలుపల అంబులెన్స్‌ను మోహరించారు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందాన్ని మోహరించారు. ఆసుపత్రి వెలుపల కూడా స్ట్రెచర్లను ఏర్పాటు చేశారు. 15 మంది వైద్యులతో సహా 25 మందితో కూడిన బృందాన్ని మోహరించారు. 

Scroll to load tweet…

హిందూస్థాన్ టైమ్స్ ప్రకారం.. దీపక్ నైట్రేట్ కంపెనీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. “ మా ఉద్యోగులందరి భద్రత, శ్రేయస్సు, చుట్టూ ఉన్న కమ్యూనిటీలు మాకు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. మా అన్ని తయారీ సౌకర్యాలు పర్యావరణపరంగా స్థిరమైన ఉత్పత్తిని నిర్ధారించే హై క్లాస్ సిస్టమ్ లు, పరికరాలతో అమర్చబడి ఉంటాయి. మా బృందాలు ఇప్పటికే ఫీల్డ్ లో ఉన్నాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మా కమ్యూనికేషన్ ఛానెల్‌లు 24×7 తెరిచి ఉన్నాయి. దీనిపై స‌మాచారాన్ని ఎప్ప‌టికిప్పుడు అందిస్తాం.” అని పేర్కొంది. ఈ ఘ‌ట‌నకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

కాగా... ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖపట్నంలో కూడా బుధ‌వారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలో ఉన్న ఓ పిష్షింగ్ కంపెనీ గోదాంలో ఒక్క సారిగా మంట‌లు చెల‌రేగాయి. అవి తీవ్రంగా వ్యాప్తి చెందాయి. ఈ భారీ అగ్నిప్ర‌మాదం విష‌యం తెలియ‌గానే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. 

జమ్మూకాశ్మీర్‌లో పౌరులను టార్గెట్ చేస్తోన్న ముష్కరులు: కేంద్రం అప్రమత్తం, అజిత్ ధోవల్‌తో అమిత్ షా భేటీ

ఈ అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న‌లో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే స‌మీపంలోని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. వారికి ప్ర‌స్తుతం అక్క‌డ డాక్ట‌ర్లు చికిత్స అందించారు. అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.