Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్: కొనసాగుతున్న ఉగ్రవాదుల ఊచకోత.. కుల్గాంలో ఇద్దరు నాన్‌లోకల్స్ కాల్చివేత

జమ్మూకాశ్మీర్‌లో (Jammu kashmir) స్థానికేతరులే (non local) లక్ష్యంగా ఉగ్రవాదుల (terrorists) దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా కుల్గాంలో (kulgam) ఆదివారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. మరొకరికిగా గాయాలయ్యాయి

Terrorists kill 2 non local labourers in Jammu and kashmirs Kulgam
Author
Srinagar, First Published Oct 17, 2021, 8:02 PM IST

జమ్మూకాశ్మీర్‌లో (Jammu kashmir) స్థానికేతరులే (non local) లక్ష్యంగా ఉగ్రవాదుల (terrorists) దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా కుల్గాంలో (kulgam) ఆదివారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. మరొకరికిగా గాయాలయ్యాయి. కాగా, శనివారం శ్రీనగర్‌లోని ఈద్గా (edga) ఏరియాలో సాయంత్రం 6.40గంటల ప్రాంతంలో చాట్ అమ్ముకునే ఓ బిహారీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్పెంటర్‌పైనా కాల్పులు జరిపారు. ఇందులో బిహార్‌కు చెందిన ఆ వీధివ్యాపారి మరణించాడు.

శ్రీనగర్ (srinagar), పుల్వామా (pulwama ) జిల్లాల్లో ఉగ్రవాదులు నాన్ లోకల్ లేబర్ల‌పై కాల్పులు జరిపారని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇందులో బిహార్‌లోని బంకాకు చెందిన అరవింద్ కుమార్ షా (arvind kumar sha) శ్రీనగర్‌లో తూటాలు తగిలి మరణించారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు (UttarPradesh) చెందిన సాగిర్ అహ్మద్‌ పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులకు గురై గాయపడ్డారని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను సీజ్ చేసి ఉగ్రవాదుల కోసం గాలింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

Also Read:మరో కశ్మీరేతరుడి హత్య.. చాట్ అమ్ముకునే బిహారీ, యూపీ లేబర్‌పై ఉగ్రవాదుల కాల్పులు

అరవింద్ కుమార్ షాను పాయింట్ బ్లాంక్ రేంజ్‌ నుంచి ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. అరవింద్‌ను హాస్పిటల్‌కు తరలించగానే అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు. గత రెండు వారాలుగా కశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది కశ్మీరీ పండిట్‌లు తాత్కాలిక శిబిరాల్లోకి వెళ్లారు. ప్రధానమంత్రి స్పెషల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద ఉద్యోగాల కోసం తిరిగి కశ్మీర్ వెళ్లిన కుటుంబాలు చెప్పాపెట్టకుండా ఉన్నప్రాంతాలను వదిలిపెట్టి తరలిపోతున్నారు.

మరోవైపు వీధి వ్యాపారిని చంపడంపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (omar abdullah) మండిపడ్డారు. పొట్టచేతపట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ కశ్మీర్‌కు రావడమే ఆయన చేసిన పాపమా అంటూ ఆవేదన చెందారు. ఆయన హత్యను ఖండించారు. కాగా, జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ లీడర్ సాజద్ లోనె (sajjad lone)  కూడా ఈ ఘటనను ఖండించారు. ఇది పూర్తిగా ఉగ్రవాదమేనని, సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios