Asianet News TeluguAsianet News Telugu

మోడీ పాలనలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు 168 శాతం తగ్గాయి - కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

జమ్మూ కాశ్మీర్ లో తమ  ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద ఘటనలు 168 శాతం తగ్గాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈశాన్య ప్రాంతంలో శాంతి శకం ప్రారంభమైందని తెలిపారు. 

Terrorism incidents in Jammu and Kashmir have reduced by 168 percent under Modi's rule - Union Minister Anurag Thakur
Author
First Published Dec 19, 2022, 3:03 PM IST

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు 168 శాతం తగ్గాయని, 2015 నుంచి వామపక్ష తీవ్రవాద ఘటనలు 265 శాతానికి పైగా తగ్గాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఉగ్రవాదం పట్ల మోడీ ప్రభుత్వానికి జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలను చేపట్టిందని, అది ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

బెంగాల్‌లో వామపక్షానికి పెరిగిన ఓటు షేర్.. కారణమేంటని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించిన అమిత్ షా.. జవాబిదే!

‘‘2016లో ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు పుల్వామా బాంబు దాడికి ప్రతిస్పందనగా జరిగాయి. కాబట్టి ఈ నిర్ణయాత్మక చర్యలన్నీ ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చాయి’’ అని ఆయన అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 80 శాతం హింస తగ్గిందని, పౌర మరణాలు 89 శాతం తగ్గాయని, 6,000 మంది మిలిటెంట్లు లొంగిపోయారని చెప్పారు.

అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. ముగ్గురికి గాయాలు.. ఎక్కడంటే ?

మోడీ ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గడంతో పాటు ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్షల రేటు 94 శాతానికి పైగా ఉందని అన్నారు. వామపక్ష తీవ్రవాద సంఘటనలు 2015 నుండి ఈ సంవత్సరం జూన్ 2022 వరకు రెట్టింపుకు పైగా తగ్గి 265 శాతానికి పైగా తగ్గాయని మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈశాన్య ప్రాంతంలో శాంతి శకం ప్రారంభమైందని ఠాకూర్ నొక్కి చెప్పారు. 

మెస్సీ ముఖంతో హెయిర్ కట్.... నెట్టింట వీడియో వైరల్...!

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్ పీఏ)ను త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని 60 శాతం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 2020లో బోడో ఒప్పందం, 2021లో కర్బీ ఆంగ్లాంగ్ ఒప్పందం, 2022లో అస్సాం-మేఘాలయ అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందంతో పాటు పలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఠాకూర్ తెలిపారు.

కాగా.. జమ్మూ కాశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోని సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా 2016 సెప్టెంబర్ 29 న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్ లోని బాలాకోట్ లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాయి. అయితే ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మరణించిన కొన్ని రోజుల తరువాత ఈ దాడులు జరిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios