Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. పేద‌రికంతో పోష‌ణ భారం అవుతుంద‌ని ఇద్ద‌రు న‌వ‌జాత శిశువుల‌ను చంపిన త‌ల్లి

ఓ కన్నతల్లి తన పిల్లల పట్ల  కసాయిగా ప్రవర్తించింది. నవజాత శిశువులను గొంతు నులిమి చంపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 

Terrible.. Mother who killed two newborn babies says that poverty will be burden of nutrition
Author
First Published Sep 28, 2022, 11:28 AM IST

భోపాల్‌లో ఇద్ద‌రు న‌వ‌జాత శిశువుల మ‌ర్డ‌ర్ హిస్ట‌రీ వీడింది. పేద‌రికం వ‌ల్ల ఇద్ద‌రి పోష‌ణ భారం అవుతుంద‌ని భావించిన త‌ల్లే కూతుర్లను చంపింద‌ని పోలీసులు తెలిపారు. ఈ విష‌యాన్ని త‌ల్లి కూడా అంగీక‌రించింది. పిల్లలను పెంచేందుకు డబ్బులు లేవని, అందుకే వారిని చంపేశానని పేర్కొంది. 

అనుమానంతో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని అత్తగారింటిముందు పడేసి.. ఓ భర్త దారుణం..

చోరికి గురైన ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల మృత‌దేహాలు శుక్రవారం తెల్లవారుజామున మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లా టీటీ నగర్‌లోని రంగమహల్ కూడలిలో లభ్యమయ్యాయి. అంత‌కు ఐదు రోజుల ముందు ఆ పిల్లలు అప‌హ‌ర‌ణకు గుర‌య్యారు. అయితే ఈ విష‌యంలో పిల్లల తల్లి సప్న, ఆమె భర్త రవిశంకర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పిల్లలను రోడ్డు పక్కన వదిలేసి వాష్‌రూమ్‌కు వెళ్లినట్లు, తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించలేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

ద‌ళిత మ‌హిళ‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆగ్ర‌హం.. త‌మ‌కు ఇష్టమైనోళ్ల‌కే ద‌ళితబంధు ఇస్తామ‌ని వ్యాఖ్య‌లు

ఈ  ద‌ర్యాప్తు స‌మ‌యంలో పోలీసుల‌కు త‌ల్లిపై అనుమానం వ‌చ్చింది. విచారణలో ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్ మారుస్తుండేది. అయితే భూత‌వైద్యం చేయించాలంటూ ఆమెను త‌ల్లిదండ్రులు బెరాసియాకు తీసుకెళ్లారు. త‌ల్లి ప్ర‌వ‌ర్త‌న తీరులో అనుమానం వ‌చ్చిన పోలీసులు ఆమెను బెరాసియా నుంచి తీసుకొచ్చి విచారించారు. అయినప్ప‌టికీ ఆమె పోలీసుల‌కు ర‌క‌ర‌కాల స‌మాధాన‌లు ఇచ్చింది. గ‌త సోమవారం మహిళ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు పోలీసులు రవిశంకర్ నగర్ కాలనీలో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఆ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో చిన్నారుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థల దూకుడు.. సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన ఈడీ

మ‌ళ్లీ పోలీసులు ఆమెను విచారించగా.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. త‌న భ‌ర్త నిరుద్యోగి అని, అంత‌కు ముందే త‌మ‌కు మూడేళ్ల కుమార్తె ఉంద‌ని, త‌రువాత ఇద్ద‌రు క‌వ‌ల‌లు జ‌న్మించార‌ని పేర్కొంది. అయితే అసలే పేద‌రికంతో బాధ‌ప‌డుతున్న త‌మ‌కు ఈ ఇద్ద‌రు పిల్ల‌ల పోష‌ణ భారం అవుతుంద‌ని భావించి చిన్నారుల‌ను గొంతు నులిమి చంపేశాన‌ని త‌ల్లి అంగీక‌రించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios