Asianet News TeluguAsianet News Telugu

"ఆ సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది, బిజెపి అనుసరిస్తోంది...": అఖిలేష్ యాదవ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విరుచుకపడ్డారు. బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అనుసరించిన బాటలోనే బీజేపీ కూడా నడుస్తోంది. సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ ఇలా అన్నీ కాంగ్రెస్‌ సూచనల మేరకే బీజేపీ నడుస్తుందని అన్నారు.  

Akhilesh Yadav says Congress Started Tradition Of Raids, BJP Is Following...
Author
First Published Mar 12, 2023, 6:54 AM IST

లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ , బీహార్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించడంపై  సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై విరుచుకుపడ్డారు. రైడ్‌ల సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందనీ, ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని మండి పడ్డారు.

సీబీఐ, ఈడీ, ఐటీ లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పని చేస్తున్నాయని అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్ కూడా చాలా మంది నేతలపై దాడులు చేసిందని, ఇప్పుడు బీజేపీ చేస్తోందని అన్నారు. సత్యం, అహింస విషయంలో కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశంలో, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సత్యమార్గాన్ని మరిచిపోయిందని అఖిలేష్ యాదవ్ అన్నారు. 

బీజేపీ చేస్తున్న కొత్త పని ఏమిటి?
 
ఆదాయపు పన్ను, ఈడీ, సీబీఐ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తాయని గుజరాత్‌లోని వ్యాపారులకు తెలుసునని అన్నారు. తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు ​​జారీ చేయడంపై అఖిలేష్ స్పందిస్తూ.. యూపీలోని టాప్ టెన్, టాప్ వంద మంది నేరగాళ్ల జాబితాను రాష్ట్ర ప్రజలకు తెలిసేలా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. కానీ.. ఆ జాబితాను ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఇంటిపై సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయి. తనను(మోడీ ప్రభుత్వం) ఎవరు పొగడకుంటే.. వారిపై దాడులు జరుగుతాయని అఖిలేష్ యాదవ్ వ్యంగ్యంగా అన్నారు. ఇందులో కొత్తదనం ఏం లేదని అన్నారు. ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన ప్రశ్నపై అఖిలేష్ మాట్లాడుతూ.. తాను ఏ పార్టీ సభ్యుడినో, ముందు ఈ విషయం చెప్పండని అన్నారు. దేశంలో బుల్డోజర్లు అహింసా మార్గాన్ని చేపట్టాయని ఆయన ఆరోపించారు.

అతిక్ అహ్మద్‌ గుజరాత్‌లోని జైల్లో ఉన్నాడు. దీనికి సంబంధించిన ఓ ప్రశ్నకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఈ పని మాది కాదని, ప్రభుత్వానిదని అన్నారు. ప్రభుత్వం చాలాసార్లు సమావేశమై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. బీజేపీ ప్రభుత్వంలోనే జైలు నుంచి నామినేషన్‌ వేసినట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎస్పీ పోటీ చేస్తున్నప్పుడు, బీజేపీ పెద్ద నాయకులు తమ కుటుంబ సభ్యులను పట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయమని ఒత్తిడి తెచ్చారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios