Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

ఓ భూ విదాదం ముగ్గురు మరణానికి కారణం అయ్యింది. భూమి హక్కు కోసం రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో ముగ్గురు చనిపోయారు. మరొకరికి గాయాలు అయ్యాయి. 

Terrible.. firing between two factions in land dispute.. 3 dead, 1 injured
Author
First Published Jan 12, 2023, 8:01 AM IST

భూ విదాదంలో మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ వాగ్వాదంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పులు చాలా సేపు కొనసాగడంతో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

దారుణం.. నరబలి ఆచారంలో బాలుడి శిరచ్ఛేదం.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేకెత్తించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫరీద్‌పూర్ ప్రాంతంలోని గోవింద్‌పూర్ గ్రామంలో ఉన్న ఓ భూమి విషయంలో కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ భూమిపై హక్కు పొందేందుకు హిస్టరీ-షీటర్, మాజీ గ్రామాధికారి అయిన సురేష్ పాల్ 20-25 మందితో బుధవారం అక్కడికి చేరుకున్నాడు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఫైర్ .. అసలేం జరిగింది?

అయితే మరో వ్యక్తి పరమవీర్ వర్గానికి చెందిన పలువురు వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొంత సమయం పాటు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది ముదరడంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నాయి. దాదాపు అరగంట పాటు కాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.  మరొకరికి గాయాలు అయ్యాయి.

'స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇతర పార్టీలకు తగిన ప్రాధాన్యత లభించలేదు'

ఈ ఘటనలో పరమవీర్ క్యాంపునకు చెందిన దేవేంద్ర సింగ్ (32), పర్విందర్ (40) అలాగే సురేష్ పాల్ డ్రైవర్ చనిపోయారు. గాయపడిన వ్యక్తిని సురేంద్ర సింగ్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ కాల్పులు ఒక్క సారిగా స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుల బలగాలను అక్కడ మోహరించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios