Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. నరబలి ఆచారంలో బాలుడి శిరచ్ఛేదం.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి..

కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. నరబలిలో క్రతువులో భాగంగా ఓ బాలుడి తలని నరికేశారు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Atrocious.. Beheading of a boy in the ritual of human sacrifice.. The body was cut into pieces..
Author
First Published Jan 12, 2023, 7:00 AM IST

సంపద పోగవుతుందనే ఆశతో, మానవ బలి ఆచారంలో భాగంగా ఓ తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, తల నరికారు. అనంతరం మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికివేశారు. వాటితో పలు క్రతువులు నిర్వహించారు. ఈ ఘటన దాద్రా నగర్ హవేలీలో వెలుగులోకి వచ్చింది. తల లేని మృతదేహాన్ని పొరుగున ఉన్న గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి వద్ద కాలువ సమీపంలో పడేశారు. 

కేంద్ర పాలిత ప్రాంతంలోని దాద్రా నగర్ హవేలీ సైలీ గ్రామం నుండి డిసెంబర్ 29వ తేదీ నుంచి ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. దీనిపై డిసెంబర్ 30వ తేదీన సిల్వాస్సా పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. బాలుడిని వెతికేందుకు అనేక పోలీసులు బృందాలు ప్రయత్నించాయి. ఈ సమయంలో ఆ బాలుడి వివరాలకు సరిపోయే సరిపోయే తల దద్రానగర్ హవేలీ జిల్లా ప్రధాన కార్యాలయం అయిన సిల్వాస్సా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాపిలో దొరికింది. 

వాపిలోని కాలువలో మృతదేహం కనుగొన్నారు. అలాగే అతడి శరీర భాగాలు సైలీ గ్రామంలో లభించాయి. వాటితో నరబలి క్రతువు నిర్వహించారని ఓ అధికారి తెలిపారు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో బాలుడిని సాయిలీ గ్రామం నుంచి కిడ్నాప్ చేసి అనంతరం నరబలి కోసం హత్య చేశారని గుర్తించారు. 

ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ఓ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం ఈ నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించాడని చెప్పడంతో బాలుడి స్నేహితులైన శైలేష్ కొహ్కెరా (28), సన్వర్ లను కూడా నిందితులుగా చేర్చారు. వారిద్దరిని జనవరి 3వ తేదీన అరెస్టు చేశారు. బాలుడు సైలీ గ్రామంలోని చికెన్ దుకాణంలో కసాయిగా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. గుజరాత్‌లోని తాపీ జిల్లా కప్రదా తాలూకాలోని కర్జన్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతడిని సూరత్‌లోని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించి తదుపరి విచారణ జరుపుతున్నారు. వాపి వద్ద తల లేని మృతదేహం లభ్యమైన తర్వాత 100 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి నేరాన్ని ఛేదించేందుకు వివిధ పనులను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ తాంత్రికుడి మాటలు విని ఓ తల్లి తన కుమారుడిని బలి ఇచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌ జిల్లాలోని గోసాయిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధనౌడీ గ్రామంలో శివ కుమార్ తన భార్య మంజు దేవి (35)తో కలిసి నివసిస్తున్నాడు. శివ కుమార్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలల కిందట భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే కొంత కాలం నుంచి మంజు దేవి ఓ తాంత్రికుడి మాయలో మునిగిపోయింది. ఈ క్రమంలో జనవరి 9వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్రామంలోని కృష్ణ విగ్రహం ఎదుట తన నాలుగు నెలల కుమారుడిని పారతో బాది హతమార్చింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంజుదేవిని అదుపులోకి తీసుకున్నారు. 4 నెలల చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే మంజుదేవి కొంత కాలం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతోందని గ్రామస్తులు తెలిపారు. ఆమె తరచుగా వింత పనులు చేస్తూ ఉండేదని పేర్కొన్నారు. మంజుదేవి ఎవరో తాంత్రికుడి మాయలో పడిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. అతడి ఆదేశాల మేరకే ఆ మహిళ తన బిడ్డను బలి ఇచ్చిందని భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios