Tensions In Belagavi:  మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క స‌రిహ‌ద్దుల్లో గొడ‌వ‌లు చెలారేగాయి.  బెంగ‌ళూరు..  బెల్గావీలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హాంపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇంక్ పూశారు. దీంతో మ‌హారాష్ట్రీయులు బెల్గావీలోని శంభాజీ విగ్ర‌హం వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న చేశారు. మ‌రుస‌టి రోజు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సంగోలీ రాయ‌న్న విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు ధ్వంసం చేశారు. దీంతో బెళగావిలో పరిస్థితి ఉద్రికత్త నెల‌కొంది.  ఈ గొడ‌వ‌లో ప్ర‌భుత్వానికి సంబంధించిన 12 వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. 

Tensions In Belagavi: మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క మధ్య స‌రిహ‌ద్దుల్లో గొడ‌వ‌లు చెలారేగాయి. క‌ర్నాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ విగ్రహంపై కొంతమంది దుండగులు ఇంకు పోశారు. ఈ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ.. మ‌హారాష్ట్రీయులు బెల్గావీలోని శంభాజీ విగ్ర‌హం వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న చేశారు. దోషుల‌ను గుర్తించి, వెంట‌నే శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌మ‌యంలో నిర‌స‌న అదుపు త‌ప్పింది. ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ ఉద్రిక్త‌త‌ల్లో ప్ర‌భుత్వానికి చెందిన 12 వాహ‌నాలు ధ్వంసం చేశారు నిర‌స‌న కారులు. దీంతో అధికారులు బెల్గావీలో గుంపులు గుంపులుగా తిర‌గ‌డాన్ని నిషేధించారు. 

వివరాల్లోకెళ్తే.. బెంగ‌ళూరులోని బెల్గావీ ప్రాంతంలో బుధవారం (డిసెంబర్ 15,2021) రాత్రి ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హానికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇంక్ పూశారు. దీంతో మ‌హారాష్ట్రీయులు బెల్గావీ శివాజీ విగ్ర‌హం వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న చేశారు. దోషుల‌ను గుర్తించి, వెంట‌నే శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌మ‌యంలో నిర‌స‌న అదుపు త‌ప్పింది.

Read Also: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు.. కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన... సీఎం కేసీఆర్

ఈ త‌రుణంలోనే శుక్రవారం రాత్రి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సంగోలీ రాయ‌న్న విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు ధ్వంసం చేశారు. దీంతో అక్క‌డ పరిస్థితి ఉద్రిక్త‌త‌ నెల‌కొంది. ఇక్క‌డ కూడా పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దీంతో క‌ర్నాట‌క-మ‌హారాష్ట్ర మధ్య సరిహద్దులో ఉద్రిక్త‌త‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

ఈ ఘ‌ట‌న‌పై కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పందించారు. సంగొల్లి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే.. బెంగళూరులో శివాజీ విగ్రహంపై ఇంకు పోయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఉండాల‌ని విజ్ఞప్తి చేశారు. శివాజీ మహారాజ్, సంగొల్లి రాయన్న వంటి స్వాతంత్ర యోధుల‌ను అవమానించడం స‌రికాద‌ని హెచ్చ‌రించారు కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర. 

Read Also: ఏపీ: 24 గంటల్లో 137 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

ఇదిలా ఉంటే... బెల్గావీ మహారాష్ట్రలో విలీనం చేయాలని మహారాష్ట్ర ఏకికరణ్ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే డిసెంబర్ 13న అసెంబ్లీ వెలుపల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసింది. బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ త‌రుణంలో కన్నడ అనుకూల సంఘాల సభ్యులు మహారాష్ట్ర ఏకీకరణ సమితి దీపక్ దాల్వీ ముఖంపై సిరా పూశారు. అనంతరం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. దీనికి ప్రతీకారంగా మంగళవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సమితి మద్దతుదారులు కన్నడ జెండాను దహనం చేసినట్లు సమాచారం. మరుసటి రోజు రాత్రి బెంగళూరులోని శివాజీ విగ్రహానికి సిరా పూశారు. విగ్రహంపై ఓ వ్యక్తి ఇంకు పోస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Read Also: Bheemla Nayak Bike Ride: బుల్లెట్‌పై దూసుకెళ్తున్న పవన్‌ కళ్యాణ్‌‌.. వీడియో వైరల్‌

ఈ ఘ‌ట‌న‌తో క‌ర్ణాట‌క, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దులో తీవ్ర ఉద్రిక్తత నెల‌కొంది. దీంతో మ‌హారాష్ట్ర‌, కర్ణాటక ప్రభుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. శనివారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం వరకు బెలగావిలో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించింది. సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి అదనపు బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో మరాఠీ మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారనే కారణంతో బెలగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.