జల్గావ్ జిల్లాలో మళ్లీ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శనివారం సాయంత్ర చోటు చేసుకున్న ఈ అల్లర్ల ఘటనలో ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మార్చి 30వ తేదీన జరిగిన ఘర్షణలో పోలీసులు 56 మందిని అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు రోజుల తర్వాత జల్గావ్‌లో మళ్లీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శనివారం విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని అతర్వాల్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయని జల్గావ్ ఎస్పీ ఎం రాజ్కుమార్ తెలిపారు.
శ్రీరామనవమి హింసాకాండ: బీహార్ లో 144 సెక్షన్.. 106 మంది అరెస్టు
‘‘ఈ అల్లర్లపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం’’ అని జల్గావ్ ఎస్పీ తెలిపారు. మార్చి 30న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నమాజ్ సందర్భంగా మసీదు వెలుపల సంగీతం వినిపించే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 56 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఆ ప్రాంతంలో అదుపులో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మసీదు వెలుపల మ్యూజిక్ ప్లే చేయడంపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని, అది రాళ్లదాడికి దారితీసిందని, ఇది తీవ్ర ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
యూపీలో మరో ఎన్ కౌంటర్.. సురేశ్ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడు హతం..
బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని ససారంలో శనివారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురికి గాయాలు కాగా, వారిని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు. ‘‘ససారంలో బాంబు పేలుడు జరిగింది. క్షతగాత్రులను బీహెచ్ యూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు’’ అని ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ తెలిపారు.
స్వలింగ పెళ్లిళ్లు సమ్మతం కాదు.. భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం : జమియత్ ఉలమా-ఐ హింద్
ఈ పేలుడుపై సమాచారం అందిన వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తోందని బీహార్ పోలీసులు వెల్లడించారు. ఓ గుడిసెలో పేలుడు సంభవించిందని, ఆ ప్రాంతం నుంచి ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రాథమికంగా ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని చెప్పారు. ఈ పేలుడు అనంతరం పోలీసు బృందం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ , పారా మిలటరీ బలగాలు శనివారం ససారంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో మత ఘర్షణలు చెలరేగిన మరుసటి రోజే ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.
