Asianet News TeluguAsianet News Telugu

యూపీలో మరో ఎన్ కౌంటర్.. సురేశ్ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడు హతం..

సురేష్ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న రషీద్ యూపీ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అతడు 2020లో మరో నలుగురితో కలిసి దొంగతనం చేసేందుకు రైనా బంధువుల ఇంట్లోకి చొరబడి, నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను చితకబాదడంతో వారు చనిపోయారని అభియోగాలు ఉన్నాయి. 

Another encounter in UP.. Accused in murder case of Suresh Raina's relatives killed..ISR
Author
First Published Apr 2, 2023, 9:52 AM IST

క్రికెటర్ సురేష్ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి యూపీలో జరిగిన పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. నిందితుడిని రాజస్థాన్ కు చెందిన రషీద్ గా గుర్తించారు. అతడి తలపై రూ.50 వేల రివార్డు ఉంది. దాదాపు డజను క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2020లో పంజాబ్ లో సరేషన్ రైనా బంధువులను హత్య చేశాడని అతడిపై అభియోగాలు ఉన్నాయి. కాగా.. శనివారం ముజఫర్ నగర్ జిల్లా షాపూర్ గ్రామంలో ఉత్తరప్రదేశ్ పోలీసుల జరిపిన ఎన్ కౌంటర్ లో అతడు మరణించాడు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సుమన్ ముజఫర్‌నగర్‌లో మీడియాతో వెల్లడించారు. 

స్వలింగ పెళ్లిళ్లు సమ్మతం కాదు.. భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం : జమియత్ ఉలమా-ఐ హింద్

షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డగించారని తెలిపారు. అయితే రషీద్ మరో వ్యక్తితో బైక్ వచ్చి పోలీసులపై కాల్పులు జరిపాడని చెప్పారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో రషీద్ మరణించారని పేర్కొన్నారు. అయితే అతడి అనుచరుడు తప్పించుకున్నారని తెలిపారు. రషీద్ వద్ద నుంచి రెండు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.. శరద్ పవార్, నితిన్ గడ్కరీల కీలక భేటీ..

ఈ ఎన్‌కౌంటర్ లో షాపూర్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బబ్లూ సింగ్‌కు కూడా బుల్లెట్ గాయమైందని, అతడిని హాస్పిటల్ కు తరలించామని పేర్కొన్నారు. రషీద్ అనుచరుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అతడి కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు రికార్డులను పరిశీలిస్తున్నామని అన్నారు. 

2020లో ఏం జరిగింది?
2020 ఆగస్టులో రైనా మేనమామ అశోక్ కుమార్, అతని కుమారుడు కౌశల్ కుమార్, భార్య ఆశారాణి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలోని తరియాల్ వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన ‘చాహ్ మార్ గ్యాంగ్’ (బవారియా గ్యాంగ్ లో భాగం) దాడి చేసింది. దోపిడి చేసేందుకు ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ముందుగా నిచ్చెన ద్వారా గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో రైనా బంధువుల కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఇంట్లో నేలపై చాపలపై నిద్రిస్తున్నారు. ఈ దొంగల ముఠా ఇంట్లోకి చొరబడి కర్రలతో కుటుంబాన్ని చితకబాది నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అయితే ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కుమారుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారిలో రాజస్థాన్‌లోని జుంజును జిల్లాకు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios