Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా.. కేసీఆర్ ఖ‌మ్మం స‌భ‌కు కేజ్రీవాల్, అఖిలేష్, పిన‌ర‌యి స‌హా కీలక నేత‌లు

Hyderabad: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మార్చుకుని జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో ఖ‌మ్మం బీఆర్ఎస్ మెగా స‌భ‌పై రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మెగా బ‌హిరంగా స‌భ‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు వామపక్ష నేతలు హాజరుకానున్నారు. 
 

Telangana : Key leaders including Arvind Kejriwal, Akhilesh Yadav, Pinarayi to come to  KCR's Khammam Mega Rally
Author
First Published Jan 17, 2023, 5:50 PM IST

Telangana CM KCR's Mega Rally: దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) త‌న పార్టీ ఖ‌మ్మం బ‌హిరంగా స‌భ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రాజ‌కీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధ‌మైన గులాబీ బాసు.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మార్చుకుని జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో ఖ‌మ్మం బీఆర్ఎస్ మెగా స‌భ‌ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స‌భ కోసం ఇప్ప‌టికే భారీ ఏర్పాట్లు చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త‌న మొద‌టి స‌భ‌తో దేశ రాజ‌కీయ పార్టీల‌కు త‌న స్వరాన్ని గ‌ట్టిగానే వినిపించేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేసిన‌ట్టు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌రిణామాలు చూస్తే తెలుస్తోంది.

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ త‌న పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుకుని మొద‌టి భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మైంది. బుధవారం ఖమ్మం పట్టణంలో మెగా బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ స‌భ‌లో దేశం న‌లుమూల‌ల నుంచి ప‌లు పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కులు పాలుపంచుకోబోతున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ స‌భ‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నాయ‌కుడు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ సీనియ‌ర్ నాయ‌కులు డీ.రాజా పాల్గొంటారని స‌మాచారం.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తన పేరును బీఆర్ఎస్ గా మార్చుకుని జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించిన తరువాత జరుగుతున్న మొదటి బహిరంగ సభ కావడం, వివిధ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్ వాదీ పార్టీ, వామపక్షాల నాయకులు కలిసి కనిపించనున్నందున ఈ సమావేశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఇతర నేతలు బుధవారం హైదరాబాద్ సమీపంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. హైదరాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో దశ ప్రారంభోత్సవానికి హాజరవుతారని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ తెలిపారు.

ప్రస్తుత  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో లౌకికవాదం, సోషలిజం, స్వేచ్ఛతో సహా రాజ్యాంగ స్ఫూర్తి నీరుగారిపోతోందని ఆరోపించిన ఆయన, దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయాలను తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతకు ఖమ్మం బహిరంగ సభను ఒక అడుగుగా చూడవచ్చా అని ప్రశ్నించగా, ఇది కేవలం ఫ్రంట్ ఏర్పాటు మాత్రమే కాదనీ, దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను చూపించాలని బీఆర్ ఎస్ కోరుకుంటోందని చెప్పార‌ని ఎన్డీటీవీ నివేదించింది. 2022 డిసెంబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన తర్వాత బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఏదో ఒక రోజు ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

అనంతరం తన పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగిస్తూ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' (ఈసారి రైతు ప్రభుత్వం) అనే నినాదాన్ని ఇస్తూ దేశంలో కొత్త ఆర్థిక, పర్యావరణ, నీరు, విద్యుత్, మహిళా సాధికారత విధానాలు అవసరమని అన్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల సీఎంలను యాదాద్రి ఆలయానికి కేసీఆర్ తీసుకెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. దేవాలయాలు కల్వకుంట్ల కుటుంబానికి వ్యాపార కేంద్రాలుగా మారాయన్నారు. యాదాద్రి అభివృద్ధి ఒక పెట్టుబడి, పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు తిరిగి వస్తున్నాయ‌ని అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం సభకు ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడులకు అవకాశంగా చూపించేందుకు కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకువ‌స్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios