టీమిండియా కోచా.. కూల్‌డ్రింక్స్‌ సేల్స్‌మెనా..? రవిశాస్త్రిపై ఫ్యాన్స్ ఫైర్

First Published 8, Aug 2018, 4:21 PM IST
team india coach ravi sastri trolled in twitter
Highlights

టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. బ్రిటన్‌లో ఇప్పుడు మండు వేసవి.. వేడిగాలుల ప్రభావంతో ఆటగాళ్లు ఉక్కపోతకు గురవుతున్నారు

టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. బ్రిటన్‌లో ఇప్పుడు మండు వేసవి.. వేడిగాలుల ప్రభావంతో ఆటగాళ్లు ఉక్కపోతకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలో ఓ ఎనర్జీ డ్రింక్‌ను ప్రమోట్ చేసేందుకు రవిశాస్త్రి ఓ వీడియో చేసి.. దానిని తన ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు..‘‘ ఇవాళ లండన్‌లో ఎండ చాలా ఎక్కువగా ఉంది... ఈ డ్రింక్ తాగి వేడి నుంచి ఉపశమనం పొందండి అంటూ వీడియోలో చెప్పాడు. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు.

భారత క్రికెట్ జట్టుకి కోచా లేకపోతే కూల్‌డ్రింక్స్‌కి సేల్స్‌మెనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిద్రపోతూ కనిపించాడు..ఇప్పుడేమో ఇలా ప్రమోషనల్సా..?,  ‘‘రవిశాస్త్రి ఆల్కహాలిక్... సేల్స్‌బాయ్, కోచ్‌గా అసలు రవిశాస్త్రి టీమ్ కోసం ఏం చేస్తున్నాడు... ముందు లార్డ్స్ టెస్టులో భారత్ ఎలా గెలవాన్న దానిపై సలహాలు ఇవ్వు’’ అంటూ మండిపడ్డారు.

 

loader