పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ , వైసీపీ పోటా పోటీ ధర్నా

TDP, YSRCP mps protest dharna at gandhi statue in parliament
Highlights

న్యూఢిల్లీలోనపి పార్లమెంట్  ‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, వైసీపీ మాజీ ఎంపీలు పోటా పోటీగా బుధవారం నాడు ధర్నాలు నిర్వహించారు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోనపి పార్లమెంట్  ‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, వైసీపీ మాజీ ఎంపీలు పోటా పోటీగా బుధవారం నాడు ధర్నాలు నిర్వహించారు.

ఏపీకి ప్రత్యేక హోదా  ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  ఇప్పటికే టీడీపీ ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. మరో వైపు ప్రత్యేక హోదా డిమాండ్ తో  వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదింపజేసుకొన్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద  మాజీ వైసీపీ ఎంపీలు,  రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  ధర్నా నిర్వహించారు.

బుధవారం నాడు  పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందుగా సుజనా చౌదరి  ఇంట్లో సమావేశమైన  టీడీపీ ఎంపీలు నేరుగా పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని ఏపీకి ఇవ్వాల్సిన డిమాండ్లపై రూపొందించిన ప్లకార్డులను ప్రదర్శించారు.

గత సమావేశాల ముగింపు రోజున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌తో  వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. గత మాసంలో  వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలనే డిమాండ్ తో  వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.

మరోవైపు సుజనా చౌదరి ఇంట్లో   సమావేశం పూర్తైన తర్వాత నేరుగా పార్లమెంట్ కు చేరుకొన్న  టీడీపీ ఎంపీలు కూడ  గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.  రెండు పార్టీలకు చెందిన  నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారుదద. 

loader