కొడుకు పెద్ద ‘గజిని’.. ఫోన్ నెంబర్ పచ్చబొట్టు వేయించిన తండ్రి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 6:50 PM IST
Tattoo of dads mobile number on missing boy
Highlights

గజిని సినిమాలో హీరోకి షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్ ఉంటుంది. ఇందువల్ల తాను ప్రతీకారం తీర్చుకోవాల్సిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్ ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటాడు.

గజిని సినిమాలో హీరోకి షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్ ఉంటుంది. ఇందువల్ల తాను ప్రతీకారం తీర్చుకోవాల్సిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్ ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటాడు. అచ్చం అలాంటి రియల్ లైఫ్ గజని ముంబైలో ఉన్నాడు. నగరానికి చెందిన వెంకన్న అనే వ్యక్తికి శివ అనే కుమారుడు ఉన్నాడు. శివకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉండటంతో.. కొడుకుని దివ్యాంగుల పాఠశాలలో చేర్పించి, చదివిస్తున్నాడు వెంకన్న.

అయితే శివ ఎప్పటిలాగే వ్యానులో స్కూలుకు వెళ్లాడు. మెమొరీలాస్ కారణంగా స్కూలు ముందు దిగి దారి మరచిపోయి ఏటో వెళ్లిపోయాడు. అలా జీటీబీఎన్ రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకున్నాడు. స్టేషన్ వద్ద తచ్చాడుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన జవాబు రాకపోవడంతో అతని చేతిపై పచ్చబొట్టుతో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు.

దీంతో వెంకన్న పరిగెత్తుకుంటూ శివ వద్దకు వెళ్లాడు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎదురుకావడంతో కుమారుడి క్షేమం కోసం అతని చేతిపై తన ఫోన్ నెంబర్ వేయించినట్లు వెంకన్న తెలిపాడు. గజిని సినిమా చూసిన తన మిత్రుడి సలహా మేరకు ఈ పని చేసినట్లు వెంకన్న తెలిపాడు.

loader