మోదీని కౌగిలించుకోవాలని రాహుల్ కి ఓ తాంత్రికుడు చెప్పాడట

Tantrik had told Rahul Gandhi to touch PM Narendra Modi’s chair, that’s why he hugged him: BJP leader
Highlights

‘నువ్వు ప్రధాని కావాలని అనుకుంటున్నట్లయితే.. సభలో నీ ప్రసంగం అయిపోయిన తరువాత ప్రధాని కుర్చీ వద్దకు వెళ్లి దానిని తాకాలని ఓ తాంత్రికుడు రాహుల్‌ గాంధీకి సూచించాడట.

పార్లమెంట్ లో సీరియస్ ప్రంసంగం తర్వాత రాహుల్ గాంధీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని హగ్ చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. అయితే.. రాహుల్ ఇలా చేయడానికి వెనక మాష్టర్ ప్లానే ఉందని బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ ఆరోపించారు.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. మునుపెన్నడూ లేని రీతిలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రసంగం ముగిశాక... ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ చర్యతో సభలోని సభ్యులంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అధికార పక్షం ఈ చర్యను తప్పుపట్టగా.. ప్రతిపక్షం మాత్రం సమర్థించుకుంది.
 
ఈ విషయం ఇలా ఉంచితే.. రాహుల్ అలా కౌగించుకోవడం వెనుక ఓ తాంత్రికుడు ఉన్నాడట. ఈ విషయాన్ని ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘నువ్వు ప్రధాని కావాలని అనుకుంటున్నట్లయితే.. సభలో నీ ప్రసంగం అయిపోయిన తరువాత ప్రధాని కుర్చీ వద్దకు వెళ్లి దానిని తాకాలని ఓ తాంత్రికుడు రాహుల్‌ గాంధీకి సూచించాడట. ఈ విషయాన్ని నాకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ చెప్పాడు’ అని తజిందర్ పాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ కుర్చీ కోసమే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారని విమర్శించారు.
 
కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ మంచితనాన్ని ఓర్వలేకనే బీజేపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చర్యతో బీజేపీ నేతల్లో గుబులు పట్టుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం అని.. ఈ కారణంగానే బీజేపీ నేతలు రాహుల్‌ను టార్గెట్ చేసుకున్నారని అన్నారు.
 

loader