Asianet News TeluguAsianet News Telugu

కూతురి పెళ్లి కోసం ఆ తల్లి ఏం చేసిందంటే: చివరికి ట్విస్ట్ ఇదీ....

కూతురు పెళ్లి కోసం  ఓ తల్లి ప్లాస్టిక్ మూటలో డబ్బులు మూట గట్టి  గొయ్యి తీసి పాతిపెట్టింది. ఇంటి నిర్మాణం కోసం తవ్వుతున్న సమయంలో  ఈ డబ్బుల మూట బయటపడింది. ఈ డబ్బులు మాత్రం ఆ మహిళకు ఉపయోగం లేకుండా పోయాయి.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

Tamilnadu woman hiding demonetation currency for daughter wedding
Author
Chennai, First Published Jul 13, 2020, 4:11 PM IST


చెన్నై: కూతురు పెళ్లి కోసం  ఓ తల్లి ప్లాస్టిక్ మూటలో డబ్బులు మూట గట్టి  గొయ్యి తీసి పాతిపెట్టింది. ఇంటి నిర్మాణం కోసం తవ్వుతున్న సమయంలో  ఈ డబ్బుల మూట బయటపడింది. ఈ డబ్బులు మాత్రం ఆ మహిళకు ఉపయోగం లేకుండా పోయాయి.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లా కొళ్లిడం సమీపంలోని పట్టియమేడుకు చెందిన రాజదురై, ఉష దంపతులు నిరక్షరాస్యులు.  కూలీ పనులు చేసి జీవనం సాగిస్తుంటారు ఈ దంపతులు. వీరికి ఓ కూతురు ఉంది.  ఆమె బధిరురాలు.

కూతురి పెళ్లి కోసం ఉష కూలీ చేయగా వచ్చిన డబ్బులను దాచింది.  ప్లాస్టిక్ సంచిలో మూటగట్టి ఇంటి వెనుక గుంత తీసి పూడ్చి పెట్టింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబానికి ఇంటిని మంజూరు చేసింది.

ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ప్లాస్టిక్ కవర్లో దాచి పెట్టిన నగదు మూట దొరికింది.  ఈ కవర్లో రద్దైన  వెయ్యి.  ఐదు వందల నోట్లు ఉన్నాయి.  ఈ నోట్లు ఇప్పుడు చెల్లవని అధికారులు చెప్పడంతో ఉష దంపతులు లబోదిబోమంటున్నారు.

కూతురు పెళ్లి కోసం దాచి పెట్టిన డబ్బు చెల్లుబాటు కాదని తెలిసి ఆ దంపతులు  లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు దాటింది. కానీ, ఈ విషయం తమకు తెలియదని ఆ దంపతులు చెప్పడం గమనార్హం.


 

Follow Us:
Download App:
  • android
  • ios