తమిళనాడులోని తిరుపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ వ్యాన్‌ను కారు ఢీకొనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మెడికో విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. సేలం నుంచి ఊటీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read యువకుడి హత్య.. 20ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన క్రిమినల్ ...

స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులందరూ వైద్య విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వల్ల ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.