దాదాపు 20 సంవత్సరాల క్రితం ఓ యువకుడు కిడ్నాప్ కి గురయ్యాడు. అతనిని కిడ్నాప్ చేసిన దుండగులే యువకుడిని హత్య చేశారు. ఈ కేసులో నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. రెండు సార్లు కేసు రీఓపెన్ చేసినా కూడా నిందితుడు దొరకలేదు. దీంతో కేసుని పూర్తిగా క్లోజ్ చేశారు. అయితే అనూహ్యంగా.. దాదాపు 20 సంవత్సరాల క్రితం నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

Also Read యువతితో లేచిపోయిన దళితుడు: అతని తమ్ముడ్ని చంపేసిన ఆమె తండ్రి, బాబాయ్...

పూర్తి వివరాల్లోకి వెళితే.. 1999లో బిహార్ రాష్ట్రం పాట్నా లో సీనియర్ పీడబ్ల్యూడీ అధికారి కుమారుడు అమిత్ కుమార్ రామావతార్ కిడ్నాప్ కి గురయ్యాడు. అతను ఆ సమయంలో ఐఐటీ చదువుతున్నాడు. ఆ సమయంలో అమిత్ వయసు 20ఏళ్లు. కాగా... అతనిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.5కోట్లు ఇస్తేనే వదిలిపెడతామని డిమాండ్ చేశారు.

అయితే.. రూ.5కోట్లు ఇవ్వలేక.. రూ.5లక్షలకు బేరం ఆడారు. అయితే... పోలీసులకు దొరికపోతానేమో అనే భయపడిపోయిన నిందితుడు... అమిత్ ని చంపేశాడు. అనంతరం శవాన్ని డంపింగ్ యార్డ్ లో పడేశాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయినా దొరకలేదు. దీంతో 2000లో కేసు క్లోజ్ చేశారు.

తర్వాత మళ్లీ కేసు రీఓపెన్ చేసినా.. నిందితుడి ఆచూకీ దొరకలేదు. దీంతో.. దాదాపు కేసును పట్టించుకోవడం మానేశారు. కాగా.. తాజాగా నిందితుడిని ముంబయిలో పోలీసులు పట్టుకన్నారు. నిందితుడి అసలు పేరు అబ్దుల్ రషీద్ అరాయ్(44) కాగా.. వేరే పేరుతో చలామణి అవుతున్నాడు. అయినప్పటికీ పోలీసులు అతనిని పట్టుకోగలిగారు.