స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకమైన పోలీస్ (police department) శాఖలో ‘‘ వీక్లీ ఆఫ్ ’’ను (week off) తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలును చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారంలోకి వచ్చిన నాటి ఉంచి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్నారు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్. పాలనలో ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తాజాగా స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకమైన పోలీస్ (police department) శాఖలో ‘‘ వీక్లీ ఆఫ్ ’’ను (week off) తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలును చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పని ఒత్తిడితో చాలామంది పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సెలవులు దొరక్కపోవడంతో పండగలు, ఇంట్లోని ఫంక్షన్లకు కూడా హాజరవ్వలేక మానసిక ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ‘వీక్లీ ఆఫ్’ ఉత్తర్వులతో లక్షలాది మంది పోలీసులకు మేలు చేకూరుతుందని అంటున్నారు.
తాజా ఆదేశాల ప్రకారం.. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ తీసుకునే అవకాశం కల్పించారు. స్టేషన్లలోని ఇతర సిబ్బంది షిఫ్ట్ పద్ధతుల్లో వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించడం కోసం చెన్నై డీజీపీ కార్యాలయంలో (chennai dgp office) ఓ ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ అందిన ఫిర్యాదులను ఆయా జిల్లాల పోలీసులకు పంపించి వేగంగా సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అలా ఈ కంట్రోల్ రూం ద్వారా ఈ ఏడాది 1.12 కోట్ల ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు అధికారులు తెలిపారు. దీంతో (british standards institution) బ్రిటిష్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూట్.. ఈ కంట్రోల్ రూంకు ఐఎస్‌ఓ గుర్తింపును అందజేసింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సీఎం స్టాలిన్ చేతుల డీజీపీ శైలేంద్రబాబుకు (tamil nadu dgp sylendra babu) అందజేశారు.
ALso Read:సీఎం సంచలన నిర్ణయం.. నా కాన్వాయ్ కోసం ప్రజలను ఆపొద్దు.. కార్ల సంఖ్య సగానికి కుదింపు
కాగా.. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని tamil nadu CM MK Stalin ఇటీవల సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం కాన్వాయ్ కోసం traffic నిలుపవద్దని, వారితోపాటే తానూ వెళ్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, తన convoyలోని vehicles సంఖ్యను సగానికి తగ్గించుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షిస్తున్నారు. తమిళనాడు సీఎం కాన్వాయ్‌లో 12 వాహనాలున్నాయి. ఇప్పుడు ఈ వాహనాల సంఖ్యను ఆరుకు తగ్గించుకున్నారు సీఎం స్టాలిన్. తాను ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలను ఇబ్బంది పడొద్దని, ట్రాఫిక్ ఆపవద్దని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచనలు చేశారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
