దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9న ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9న ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం చేపట్టాల్సిన మెగా వ్యాక్సిన్ క్యాంపులు శనివారానికి వాయిదా వేసింది. కాగా.. సీఎంవో నుంచి త్వరలోనే మరిన్ని ఆంక్షలు, అధికారిక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్‌డౌన్ (tamilnadu lock down) విధించే అవకాశం ఉంది.

కాగా.. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 2731 కరోనా కేసులు నమోదయ్యాయి. చెన్నైతోపాటు ఐదు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటితో తమిళనాడులో ఇప్పటి వరకు కోవిడ్ బారడిన పడిన వారి సంఖ్య 27 లక్షల 55కి చేరింది. మొత్తం 36 వేల 805 మంది కరోనా కారణంగా మరణించారు. గడిచిన 24 గంటల్లో పాజిటివ్‌గా తేలిన కేసుల్లో.. 48 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తిరిగొచ్చిన వారే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాలని, కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (mk stalin) పిలుపునిచ్చారు. 

దేశంలో కరోనా Omicron కేసులు పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కరోనా రోగుల హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. గతంలో పది రోజుల పాటు స్వీయ నిర్భంధ కాలాన్ని వారం రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు లేదా స్వల్ప లక్షణాలు ఉన్న Corona బాధితులు పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే ఏడు రోజుల పాటు home isolation లో ఉండాలని పేర్కొంది.

ALso Read:కరోనా రోగుల హోం ఐసోలేషన్ ఇక నుండి ఏడు రోజులే: కేంద్రం గైడ్‌లైన్స్

ఎప్పుడూ కూడా మూడు లేయర్ల మాస్క్ ను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఎనిమిది గంటలకు ఓసారి మాస్క్ ను మార్చుకోవాలని కోరింది. 72 గంటల తర్వాత మాస్క్ ను ముక్కలుగా కత్తిరించాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లాల్సి వస్తే ఎన్-95 మాస్క్ ను ఉపయోగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.

కరోనా సోకిన రోగులు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలని కోరింది. మరో వైపు ఎక్కువగా ద్రవ పదార్ధాలను సేవించాలని కోరింది. శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడూ పరిశీలించుకోవాలని సూచించింది. జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలన్నారు. చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో బాధితుడి రూమ్ ను ఇతరులు ఉపయోగించవద్దని కూడా ఆరోగ్యశాఖ తెలిపింది.హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులు వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఏడు రోజుల తర్వాత ఐసోలేషన్ నుండి బయటకు రావొచ్చు. అయితే ఆ తర్వాత మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం కోరింది.