Asianet News TeluguAsianet News Telugu

జల్లికట్టుకు వెళ్లి తిరిగి వస్తుండ‌గా ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి, 11 మందికి గాయాలు

Pudukottai: తమిళనాడులోని పుదుకోట్టైలో మంగళవారం జల్లికట్టు ఉత్సవాలకు హాజరై తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరితో పాటు జ‌ల్లిక‌ట్టులో పాలుపంచుకున్న రెండు ఎద్దులు సైతం మృతి చెందాయి. 
 

Tamil Nadu: Two killed, 11 injured in road accident while returning from Jallikattu program
Author
First Published Jan 18, 2023, 3:05 PM IST

Tamil Nadu road accident: జల్లికట్టు కార్య‌క్ర‌మానికి వెళ్లి తిరిగి వస్తున్న క్ర‌మంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరితో పాటు జ‌ల్లిక‌ట్టులో పాలుపంచుకున్న రెండు ఎద్దులు సైతం మృత్యువాత ప‌డ్డాయి.  ఎద్దులు, జ‌ల్లిక‌ట్టుకు వెళ్లివ‌స్తున్న వారి కార్గో వాహ‌నం రాష్ట్ర ప్ర‌భుత్వ బ‌స్సును ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పోలీసులు, స్థానికులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జ‌ల్లిక‌ట్టు కార్య‌క్ర‌మానికి వెళ్లి వ‌స్తుండ‌గా, తమిళనాడులోని పుదుకోట్టైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రెండు ఎద్దులు సైతం మృత్యువాత ప‌డ్డాయి. జిల్లాలోని వన్నియన్‌విదుతి ప్రాంతంలో మంగళవారం నాడు ఈ రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. వన్నియన్‌విదూతి వద్ద జల్లికట్టులో పాల్గొని ఐదుగురు వ్యక్తులు మినీ కార్గో వాహనంలో మూడు ఎద్దులను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు ఎద్దులు సైతం స్పాట్ లోనే మ‌ర‌ణించాయి. 

మృతులు తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా సేవాలూర్‌కు చెందిన మథియాలగన్‌, మధురైలోని పూలంగుళంకు చెందిన విక్కీగా గుర్తించారు. తిరువరంకుళం సమీపంలో కరంబకుడి వెళ్తున్న ప్రభుత్వ బస్సును వీరు ప్రయాణిస్తున్న కార్గో వాహనం ఢీకొట్టింది. వారు ప్రయాణిస్తున్న రెండు ఎద్దులు కూడా ప్రమాదంలో మృతి చెందాయి. గాయపడిన మరో ఎద్దును గ్రామస్తులు, పశుసంవర్థక శాఖ అధికారులు రక్షించారు. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది గాయప‌డ్డారు. క్ష‌త‌గాత్రులను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పుదుకోట్టై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బీహార్ రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు యాత్రికులు మృతి.. 

బీహార్ లో బుధ‌వారం చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు బుధవారం ఉదయం సబరాబాద్‌లోని రోహ్‌టాస్‌లోని  రోడ్డు పక్కన రెస్టారెంట్ సమీపంలో జీటీ రోడ్డు (ఎన్ హెచ్ 13)పై ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో పశ్చిమబెంగాల్ కు చెందిన ఇద్దరు యాత్రికులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారణాసి నుంచి కోల్ క‌తా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను పంచగోపాల్ మైతి (70), ఆయన కుమారుడు బంకిమ్ మైతి (46)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పద్మావతి మైతి (36), ఆమె కుమారుడు జైష్ (18), డ్రైవర్ భవిన్ ను ససారంలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారనీ, పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా దాస్ పూర్ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతుల బంధువులు, క్షతగాత్రులకు సమాచారం అందించినట్లు ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios