Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడుకు మరో రెండు రోజులు భారీ వర్షాలు: ఐఎండీ వార్నింగ్

తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది . 

Tamil Nadu to receive heavy rainfall for two days
Author
New Delhi, First Published Nov 28, 2021, 1:52 PM IST


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రంతో పాటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో  నీరు నిలిచింది. రెవిన్యూ, విపత్తు నిర్వహణ ప్రకారం ఈ సీజన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నవంబర్ లో రాబోయే కొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగితే 2015 వర్షాల రికార్డును అధిగమించనున్నాయి.ఇటీవలనే  Tamilnadu రాష్ట్రంలో  Heavy rains కురిశాయి.  కాంచీపురం, వర్షరాజపురంలో Ndrfసిబ్బంది కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు తెల్లవారుజామున  కురిసిన భారీ వర్షంతో రామేశ్వరం వాసులు ఉలిక్కిపడ్డారు.  తమిళనాడు తీర ప్రాంత జిల్లాలకు Imd రెడ్ అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల  ప్రజలను సురక్షితన ప్రాంతాలకు తరలించారు. ఈ మేరకు సేలం జిల్లా యంత్రాంగం సూచించింది.

also read:Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..

గత రెండు రోజులుగా మధురై నగరం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నీటి నిల్వ పెరిగిందని అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో 75 నుండి 90 శాతం వరకు నీటి సామర్ధ్యం ఉందని జిల్లా కలెక్టర్ అనీష్ శేఖర్ తెలిపారు. వేలూరులో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. ఈ నెల 29వ తేదీ వరకు  తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కారైకల్ , దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ‌్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.మరో వైపు పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. దీంతో జన జీవనం స్ధంభించింది,. ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకే  8 సెంమీ. వర్షపాతం 8 సెం.మీ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా డిసెంబర్ 1వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 మి.మీ. వర్షపాతం నమోదైంది. చెన్నై, తిరువళ్లూరు,కాంచీపురం, చెంగల్ పేట్, కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై. టుటికోరిస్, అరియలూరు, పెర్మలూరు, దిండిగల్, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, వెల్లూరులలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 మి.మీ. వర్షపాతం నమోదైంది. చెన్నై, తిరువళ్లూరు,కాంచీపురం, చెంగల్ పేట్, కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై. టుటికోరిస్, అరియలూరు, పెర్మలూరు, దిండిగల్, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, వెల్లూరులలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో సాధారణం కంటే 75 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం నాడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. 200 ఏళ్లలో చెన్నైలో 100 సెంమీ. వర్షపాతం నమోదు కావడం ఇది నాలుగో సారి. చెన్నైలో 653 మందిని ఆరు సహాయ కేంద్రాల్లో ఉంచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios