Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు వర్షాలు : వరదల్లో చిక్కుకుపోయిన 800 మంది రైలు ప్రయాణికులు..

తమిళనాడులోని తూత్తుకుడిలో వరదల కారణంగా చెన్నై వెళ్లే రైలులో దాదాపు 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.

Tamil Nadu rains : 800 train passengers trapped in floods, Thoothukudi  - bsb
Author
First Published Dec 19, 2023, 9:46 AM IST

తమిళనాడు : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంటం వద్ద వరదల కారణంగా చెన్నైకి వెళ్లే రైలులో 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, జిల్లాలో విధ్వంసం సృష్టించాయని సోమవారం ఒక అధికారి తెలిపారు. తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి జిల్లాలను కూడా వర్షాలు అతలాకుతలం చేశాయి. 

టెంపుల్ టౌన్ తిరుచెందూర్ నుండి బచెన్నైకి వెళుతున్న రైలు ఈ వరదల్లో చిక్కుకుపోయింది. దీంతో ఆ రైల్లో ఉన్న 800మందిప్రయాణికులు శ్రీవైకుంటం వద్ద దాదాపు 20 గంటలపాటు చిక్కుకుపోయారు. ఈ 800 మంది ప్రయాణికుల్లో సుమారు 500 మంది శ్రీవైకుంటం రైల్వే స్టేషన్‌లో ఉన్నారని, 300 మంది సమీపంలోని పాఠశాలలో ఉన్నారని ఆయన తెలిపారు.

ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషిలను ప్రారంభోత్సవానికి రావద్దన్న రామ్ టెంపుల్ ట్రస్ట్

తిరునల్వేలి-తిరుచెందూర్ సెక్షన్‌లో శ్రీవైకుంటం-సెయ్దుంగనల్లూర్ మధ్య బ్యాలస్ట్ కొట్టుకుపోవడంతో పాటు ట్రాక్ వేలాడుతూ రైలు పట్టాలపై నీరు ప్రవహిస్తున్నందున దక్షిణ రైల్వే ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సాధారణ జీవితం ప్రభావితమైంది, రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సేవలను కోరింది. వర్ష ప్రభావిత జిల్లాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తిరునెల్వేలి-తిరుచెందూర్ సెక్షన్‌లో శ్రీవైకుంటం-సెయ్దుంగనల్లూర్ మధ్య 'బ్యాలాస్ట్' కొట్టుకుపోయి, ట్రాక్ 'వేలాడుతూ' రైల్వే ట్రాక్‌లపై నీరు ప్రవహిస్తున్నందున ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది. దక్షిణ ప్రాంతాల మీదుగా నడిచే అనేక రైలు సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి, కొన్ని పాక్షికంగా నిలిపివేశారు. మరి కొన్ని రైళ్లు దారి మళ్లించబడ్డాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios