చెన్నై: పెళ్లికి నిరాకరించడంతో   ఓ స్కూల్ టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ  ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గాయత్రీ మెట్రిక్యులేషన్ స్కూల్ లో ఎస్. రమ్య అే 23 ఏళ్ల యువతి గణితం బోధించే టీచర్‌గా పనిచేస్తున్నారు. రాజశేఖర్ అనే వ్యక్తి ఇవాళ స్కూల్‌లో రమ్య వద్దకు వచ్చి ఆమె వాగ్వావాదానికి దిగి హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

కాలేజీ  చదివే రోజుల్లో నుండే  రమ్యకు రాజశేఖర్ తెలుసునని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆరు మాసాల క్రితం రమ్యను పెళ్లి చేసుకొంటానని నిందితుడు ఆమె కటుంబసభ్యులను కోరినట్టుగా సమాచారం.  అయితే ఈ పెళ్లికి రమ్య కుటుంబం వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రాజశేఖర్ ఇవాళ ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.