పుట్టింటికి వెళ్లిన భార్యను తన ఇంటికి పంపించమని అత్తారింటికి వెళ్లి అల్లుడు గొడవ చేశాడు. డెలివరీ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదని... కొంతకాలం తర్వాత పంపుతామని ఎంత నచ్చచెప్పినా వినలేదు. దీంతో...  కోపం వచ్చిన అత్తామామ.. అల్లుడిని చితకబాదారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తంజావూర్‌ సమీపంలోని రెడ్డి పాళ్యం మేట్టు వీధికి చెందిన జయశీలన్‌ (28). అదే ప్రాంతానికి చెందిన మారిముత్తు కుమార్తె దేవికా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరుకుటుంబాల వారు అంగీకరించడంతో... రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు.

AlsoRead నకిలీ డాక్టర్ నిర్వాకం... 13 ఏళ్ల చిన్నారి మృతి...

ఇటీవల దేవికా మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో.. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. అయితే... తన భార్య, బిడ్డను తన ఇంటికి పంపించేయమని అడిగాడు. దానికి దేవికా బాలింత అని మరో నెల రోజులు తరువాత పంపిస్తానని మారిముత్తు తెలిపాడు. దీంతో జయశీలన్‌ అత్తామామలతో గొడవకు దిగాడు. దీంతో మారిముత్తు కుటుంబ సభ్యులు జయశీలన్‌కు దేహశుద్ధి చేశారు. ఈ గొడవలో దేవాకి గాయమయింది. ఇద్దరు తంజావూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.