లవ్ మ్యారేజ్: ట్విస్టిచ్చిన భర్త, పుట్టింటికి వెళ్ళిన భార్య

tamil nadu love marriage matter
Highlights

తర్వాత ఏమైందంటే...?

చెన్నై: లింగమార్పిడి చేసుకొన్న ఓ యువతి  ప్రేమ వివాహం చేసుకొంది. అయితే ఈ విషయం తెలిసిన భార్య షాక్ గురైంది. దీంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో భర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల మధ్య  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని వడలూరు గ్రామానికి చెందిన ఓ యువతి లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకొంది. ఆ యువతి యువకుడిగా మారింది.  యువతిగా మారిన యువకుడు  ఓ ప్రైవేట్ కంపెనీలో స్టోర్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతితో అతను ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కొంతకాలం పాటు కలిసి తిరిగారు. చివరకు రహస్యంగా ఏడాది క్రితం వివాహం చేసుకొన్నారు.  భర్త వ్యవహరంపై అనుమానం వచ్చిన భార్య అతడిని నిలదీసింది.

లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకొన్న యువకుడిగా మారిన విషయాన్ని అతను తేల్చి చెప్పాడు. దీంతో ఆమె వేరు కాపురం పెట్టింది. రెండు రోజుల క్రితం ఆమెను కలిసి జీవిద్దామని భర్త కోరారు. కానీ, ఆమె నిరాకరించింది.దీంతో అతను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

loader