Asianet News TeluguAsianet News Telugu

టాయిలెట్స్ శుభ్రం చేయాలని ఎస్సీ విద్యార్థులను బలవంతం చేసిన ప్రధానోపాధ్యాయురాలు.. కులం పేరుతో..

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయురాలు.. వారిపై వివక్ష చూపెట్టింది. షెడ్యూల్ కులాలకు (schedule caste) చెందిన  విద్యార్ధులను దుర్బాషలాడటమే కాకుండా.. మరుగుదొడ్లు శుభ్రం చేయాలని బలవంతం (forces to clean toilets) చేసింది.

Tamil nadu Govt school headmistress suspended after forces students to clean toilets
Author
Tirupur, First Published Dec 19, 2021, 3:11 PM IST

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయురాలు.. వారిపై వివక్ష చూపెట్టింది. షెడ్యూల్ కులాలకు చెందిన  విద్యార్ధులను దుర్బాషలాడటమే కాకుండా.. మరుగుదొడ్లు శుభ్రం చేయాలని బలవంతం (forces to clean toilets) చేసింది. తమిళనాడులోని (Tamil Nadu) తిరుపూర్‌లో (Tirupur) చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయురాలుపై ఆరోపణలు వెలువెత్తడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఇడువాయి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ దాదాపు 400 మంది విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్నారు. గీత గత మూడేళ్లుగా అక్కడే పనిచేస్తోంది. 

శుక్రవారం 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయురాలు గీతపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించారని రమేష్ తెలిపారు. తాను పాఠశాలను సందర్శించానని ప్రాథమిక సమాచారాన్ని సేకరించానని వెల్లడించారు. ఆ తర్వాత ఆమెను సస్పెండ్ చేసినట్టుగా చెప్పారు. తన విచారణ ఆధారంగా మంగళం పోలీసులకు (Mangalam police) ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు.  

ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆమెపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios